Srikanth: ఒకప్పుడు విలన్‌గా తన కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీకాంత్. కొన్నాళ్ల పాటు హీరోగా పలు చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకవైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే.. మరోవైపు సపోర్టింగ్ యాక్టర్‌గానూ రాణించాడు. ఇక బోయపాటి, బాలకృష్ణ హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’తో మళ్లీ విలన్‌గా మారాడు శ్రీకాంత్. ఈ సినిమాలో మైనింగ్ మాఫియా లీడర్ వరదరాజులుగా శ్రీకాంత్ విలనిజానికి మంచి మార్కులే పడ్డాయి.
శ్రీకాంత్ తాజాగా యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందరర్భంగా అఖండ గురించి, వరదరాజులు పాత్ర గురించి పలు విషయాలు వెల్లడించారు. ‘సరైనోడు సినిమాలో నటిస్తున్న సమయంలోనే బోయపాటి శ్రీను తనని పిలిచి విలన్ క్యారెక్టర్‌లో నటిస్తారా అని అడిగారని తెలిపారు. దానికి బదులు ఒకే చెప్పిపారట. అంతకు ముందు యుద్ధం శరణం సినిమాలో విలన్‌గా చేసినా పెద్దగా జనాల్లోకి వెళ్లలేదు.
అయితే జనాలకు శ్రీకాంత్ ఇన్నాళ్లు పాజిటివ్ పాత్రల్లో కనిపించి, ఒక్కసారిగా విలన్ రోల్స్ లో చూసేందుకు ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే అలవాటవుతున్నట్టు పలువురు అంటున్నారు. అలాగే గతంలో హీరోగా ఊపేపిన జగపతి బాబు కూడా ప్రస్తుతం విలన్ రోల్ లో దూసుకెళ్తున్నాడు.
- Advertisement -
అయితే అఖండ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదట శ్రీకాంత్.. వరదరాజులు క్యారెక్టర్ చేశాకే తాను కూడా విలన్‌గా చెయ్యొచ్చుననే కాన్ఫిడెంట్ ఇచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో మెగా హీరో రామ్‌చరణ్, స్టార్ డైరెక్టరర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం గురించి కూడా మాట్లాడారు. ఈ సినిమాలో తన పాత్రను చూసి ప్రతి ఒక్కరు షాకవుతారని చెప్పారు. తనను గుర్తుపట్టే అవకాశం కష్టమనని అంటున్నారు. ఒక కొత్త శ్రీకాంత్ ను చూడబోతున్నారని పేర్కొన్నారు.

కాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆర్సీ 15’ సినిమా పనులు కొనసాగుతున్నాయి. ఈ మేరకు మూవీకి సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ జీ స్టూడియోస్ వారు దక్కించుకున్నట్లు కూడా తాజా సమాచారం. కాగా రామ్ చరణ్ – శంకర్‌ల సినిమా 2023 సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాత దిల్ రాజు ఇటీవల ప్రకటించారు.