Srikanth Odela : దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఎవరు.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి..?

NQ Staff - April 1, 2023 / 04:20 PM IST

Srikanth Odela : దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఎవరు.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి..?

Srikanth Odela : యంగ్ దర్శకులు ఊపేస్తున్నారు. చాలామంది కొత్త దర్శకులు మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ ను షేక్ చేసి పడేస్తున్నారు. తాజాగా శ్రీకాంత్ ఓదెల పేరు కూడా మార్మోగిపోతోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా ఆయన తెరకెక్కించిన దసరా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. భారీ కలెక్షన్లు రాబడుతోంది.

దాంతో అసలు శ్రీకాంత్ ఓదెల ఎవరు, ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాలపై అంతా ఆరా తీస్తున్నారు. ఈయన ఎవరో కాదు.. ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు. ఆయనది కరీంనగర్ జిల్లాలోని సింగరేని ప్రాంతం. చిన్నప్పటి నుంచే ఆయనకు సినిమా రైటింగ్, స్కీనింగ్ మీద చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది.

అందుకే సినిమాల వైపు అడుగులు వేశారు. ఆయన 2016 లో తీసిన టూ ఫాదర్ విత్ లవ్ అనే షార్ట్ ఫిలిం కు ఎన్నో అవార్డ్స్ కూడా అందుకున్నాడు. దాని తర్వాత ఆయన సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు.

ఇప్పుడు దసరా మూవీతో ఏకంగా శ్రీకాంత్ ఓదెల  డైరెక్టర్ గా నిరూపించుకున్నాడు. మొత్తానికైతే మొదటి సినిమాతోనే కుంభస్థలం బద్దలు కొట్టేశాడు. సుకుమార్ శిష్యుడు కాబట్టి సినిమాల్లో అక్కడక్కడా సుకుమార్ మార్క్ కూడా కనిపిస్తోంది. గతంలో బుచ్చిబాబు సాన కూడా మొదటి మూవీ ఉప్పెనతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఎంతైనా సుకుమార్ శిష్యులు అంటే ఆరేంజ్ లోనే ఉంటారని నిరూపిస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us