Maa Elections: డ‌బ్బులు పంచుతున్నారంటూ న‌రేష్ ఆరోప‌ణ‌లు.. ఖండించిన శ్రీకాంత్‌

Maa Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు అసెంబ్లీ ఎన్నిక‌ల క‌న్నా చాలా హాట్‌గా న‌డుస్తున్నాయి. ఒక‌రిపై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకుంటూ ర‌చ్చ చేస్తున్నారు. నిన్న నాగ‌బాబు చేసిన వ్యాఖ్య‌లకు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చాడు. ఇక మంచు విష్ణుకు స‌పోర్ట్ చేస్తున్న న‌రేష్ తాజాగా ఓ వీడియో ద్వారా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

Srikanth and Naresh Alleging Each Other Before Maa Elections
Srikanth and Naresh Alleging Each Other Before Maa Elections

ఇప్పుడే అందిన దుర్వార్త‌. ప్ర‌త్య‌ర్థులు మూడు నాలుగు సెంటర్స్‌లో ప‌ది నుండి పాతిక వేలు డ‌బ్బులు పంచుతున్నారు. మ్యానిఫెస్టో కూడా అనౌన్స్ చేయ‌కుండా అంత కాన్ఫిడెంట్‌తో వారు ముందుకు వెళుతున్నారంటే డ‌బ్బు మ‌మ్మ‌ల్ని గెలిపిస్తుంద‌ని న‌మ్మి ముందుకు వెళుతున్నారు. ఎల‌క్ష‌న్స్ కోసండ‌బ్బులు పంచుతున్నారు. డ‌బ్బులు ఇస్తే తీసుకోండి, కాని మంచు విష్ణుకి ఓటు వేయండి. నేను అబ‌ద్దాలు ఆడ‌ను. నాకు వ‌చ్చిన వార్త‌ని నీకు చెబుతున్నాను అని న‌రేష్ పేర్కొన్నారు.

న‌రేష్ వ్యాఖ్య‌ల‌కు వెంట‌నే స్పందించిన శ్రీకాంత్..ఒట్టేసి చెబుతున్నాం. డ‌బ్బులు పంచో లేదంటే మందుబాటిల్స్ పంచో మేము ఓట్లు అడ‌గ‌ట్లేదు. న‌రేష్ గారు ఇంకా ఎందుకు అబ‌ద్దాలు ఆడుతున్నారు. మీరు ఎవ‌రితోనో డ‌బ్బులు పంపి ప్ర‌కాశ్ రాజు ఇస్తున్నాడ‌ని ప్ర‌చారం చేయాల‌నుకుంటున్నారో, వారు చేసే త‌ప్పుడు ప‌నులు మా మీద రుద్ద‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ద‌స‌రా మూమెంట్‌లో ఉంది. అమ్మ‌వారే ఏదైన తేడా వ‌స్తే నాశ‌నం చేస్తారు.త‌ప్పుడు వార్త‌లు న‌మ్మొద్దు.

మా మీద బుర‌ద జ‌ల్లాల‌ని అనుకుంటున్నారా, ఆలోచించండి, ఏం మాట్లాడుతున్నారు.మీరు పంచుతున్నారు. ఇంకా బుర‌ద జ‌ల్లాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారా, ఎవ‌రిద్వారానో డ‌బ్బులు పంపి ప్ర‌కాశ్ రాజ్ బ్యాడ్ చేయాల‌ని అనుకుంటున్నారా అంటూ గ‌ట్టిగా ఫైర్ అయ్యాడు శ్రీకాంత్.