Srikanth Addala: వెంకటేష్ తో హిట్ కొడితే పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్

Srikanth Addala: ఒక్కోసారి అంతే.. అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. నిన్న మొన్నటి వరకు అవకాశాలు లేని దర్శకులకు ఒకే సారి వరుస అవకాశాలు ఇస్తుంది ఇండస్ట్రీ. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. బ్రహ్మోత్సవం వచ్చి ఐదేళ్ల అయినా కూడా ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు ఈయన. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో శ్రీకాంత్ అడ్డాల పట్టించుకోవడం మానేశారు మన హీరోలు నిర్మాతలు. కనీసం ఆయన ఉన్నాడు అనే సంగతి కూడా చాలామందికి గుర్తులేదు. ఇలాంటి సమయంలో వెంకటేష్ హీరోగా అసురన్ సినిమా రీమేక్ చేసే అవకాశం అందుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. తమిళంలో ధనుష్ హీరోగా వచ్చిన ఈ సినిమాను తెలుగులో వెంకటేష్ హీరోగా సురేష్ బాబు నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా చాలా బాగా వచ్చింది అంటూ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. సెన్సిటివ్ సినిమాని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన తీరుకు నిర్మాత హీరో ఇద్దరు సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమా పూర్తి కాకముందే శ్రీకాంత్ అడ్డాలకు మరో రెండు భారీ నిర్మాణ సంస్థల నుంచి అవకాశాలు వచ్చాయి. చాలా రోజుల కింద గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా చేయడానికి అడ్వాన్స్ తీసుకున్నాడు. నారప్ప తర్వాత ఈ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈలోపు దిల్ రాజు సంస్థ నుంచి కూడా శ్రీకాంత్ అడ్డాలకు ఒక ఆఫర్ వచ్చింది అని ప్రచారం జరుగుతోంది.

గతంలో కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలు ఆ నిర్మాణ సంస్థలో చేశాడు శ్రీకాంత్ అడ్డాల. ఒకరకంగా అది ఆయన మాతృసంస్థ ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ దిల్ రాజు మంచి ఆఫర్ రావడంతో ఆయన సంతోషంగా ఉన్నాడు. అయితే గీతా ఆర్ట్స్ సినిమా మాత్రం నువ్వే మేనేజ్ చేసుకుని రావాలి అంటూ దిల్ రాజు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సంస్థలో ఏకంగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం శ్రీకాంత్ అడ్డాలకు దిల్ రాజు ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక కండిషన్ పెట్టారు. నారప్ప హిట్ అయితేనే పవన్ కళ్యాణ్ సినిమా ఆఫర్ శ్రీకాంత్ అడ్డాలకు వచ్చేలా కనిపిస్తోంది. అంటే నారప్ప విడుదలైన తర్వాత శ్రీకాంత్ అడ్డాల ఫ్యూచర్ ఏంటో తెలుస్తుంది అన్నమాట.