Srihari: అంత పెద్ద స్టార్ భార్య ఇప్పుడు గ‌డ్డు కాలం ఎదుర్కొంటుంది..!

Srihari: తెలుగు ఇండస్ట్రీలో విలనిజానికి కేరాఫ్ అడ్రస్ ఆయన. ఫైట్ చేస్తే థియేటర్ లు షేక్ అవ్వాల్సందే.. హీరోగా డైలాగ్ చేప్తే ప్రేక్షకులు సైతం ఫిదా అవ్వాల్సిందే. ఆయనే శ్రీహరి. నటుడుగా నిరూపించుకోవాలంటే కేవలం ఒక హీరోగానో, విలన్ గానో పరిమితం కాకుండా సినిమాకి తగిన కారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసేవారే నిజమైన నటులు. అలాంటి రియల్ స్టార్ శ్రీహరి. తెలుగు ఇండస్ట్రీకి ఆయనొక వరం. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగి సినిమాలపై మక్కువతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన వ్యక్తి. విలన్, కమెడియన్, హీరో ఇలా ఏ పాత్రకైనా ఆలోచించకుండా, బెదరకుండా సై అనే వ్యక్తిత్వం ఆయనది.

నిజ జీవితంలో కూడా ఎంతో ఉదారమైన వ్యక్తి కావడం విశేషం. తన దగ్గరకు సాయం కోసం వచ్చిన వారికి లేదనుకుండా సాయం చేసే మనిషి శ్రీహరి. అయితే విధి గీసిన తలరాతలో 49 సంవత్సరాలకే ఆయన మరణించడం తెలుగు ఇండస్ట్రీకి తీరని శోకం. వెండితెరతో పాటు శ్రీహరి కుటుంబం కూడా ఎంతో దిగ్భ్రాంతికి చెందింది. ముఖ్యంగా ఆయన భార్య, పిల్లలు చాలా రోజులు మానసికంగా కృంగిపోయారు. రీసెంట్ గా శ్రీహరి భార్య, ప్రముఖ నటి డిస్కోశాంతి ఇంటర్వ్యూలో భాగంగా శ్రీహరి గురించి ఎన్నో భావోద్వేగమైన విషయాల్ని వెల్లడించారు. శ్రీహరి మరణంతో ఎన్నో రోజులు ఆమె తీవ్రంగా నిరాశకు గురయ్యారు. మానసికంగా, ఆర్థికంగా ఆవేదనకు గురయ్యారు. కుటుంబాన్ని నడపడంలో ఆర్థికంగా ఎన్నో కష్టాలు ఎదుర్కోన్నారని తెలిపారు. శ్రీహరి వ్యక్తిత్వం, సహాయ గుణం గురించి వివరించారు. శ్రీహరి సంపాదించిన డబ్బును సాధ్యమైనంతవరకు సేవా కార్యక్రమాలకు వెచ్చించేవారని.. అలా చేసినందుకు ఎంతో మానసిక సంతృప్తి పొందేవారని తెలిపింది.

ప్రస్తుతం ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి చెన్నైలో నివసిస్తున్నారు. లేటెస్ట్ గా శ్రీహరి పెద్ద కుమారు మేఘాంశ్ శ్రీహరి టాలీవుడ్ ఇండస్ట్రీకి రాజ్ దూత్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ప్రముఖ హీరోయిన్ డిస్కోశాంతి పెళ్ళికి ముందు ఎన్నో సినిమాల్లో నటించారు. టాలీవుడ్ లో టాప్ హీరోల సినిమాల్లో ఎన్నో స్పెషల్ సాంగ్స్ తో మెప్పించింది. తెలుగు, తమిళ్, కన్నడ సినిమా ఇండస్ట్రీలో మొత్తం 900కు పైగా సినిమాల్లో నటించారు. అంతేకాకుండా ఆమె మంచి నటిగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత శ్రీహరిని పెళ్ళి చేసుకున్నారు.