Srihan And Siri : శ్రీహాన్, సిరి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయట
NQ Staff - December 27, 2022 / 10:53 AM IST

Srihan And Siri : యూట్యూబ్ ద్వారా పాపులారిటీ సొంతం చేసుకున్న సిరి హనుమంతు మరియు శ్రీహాన్ ఇద్దరు కూడా బిగ్ బాస్ లో మంచి ప్రదర్శన కనబరిచి ఫైనల్ వరకు వచ్చారు. ఇటీవలే ముగిసిన బిగ్బాస్ సీజన్ 6 రన్నర్ గా శ్రీహాన్ నిలిచాడు.
అయితే అతనికి దక్కిన ప్రైజ్ మనీ భారీ ఎత్తుగానే ఉంది. విజేత కంటే కూడా అధికంగా శ్రీహాన్ మనీ దక్కించుకున్నాడు. సిరి కూడా బిగ్ బాస్ గత సీజన్ లో మంచి క్రేజ్ తో పాటు ప్రేక్షకుల్లో ఆదరణ కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక వీరిద్దరూ సుదీర్ఘ కాలంగా ప్రేమలో ఉన్న విషయం అందరికి తెల్సిందే. సిరి బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన సమయంలో వీరి ప్రేమ బ్రేకప్ అయ్యిందని అంతా భావించారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరూ పెళ్లికి సిద్ధమయ్యారు.
ఆ సమయంలో నాలుగు ఐదు నెలల పాటు గ్యాప్ వచ్చింది.. కానీ మళ్ళీ ఒక్కటి అయ్యారట. శ్రీహాన్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు సిరి చాలా కష్టపడి అతడికి ఓట్లు వేయించే విషయమై ప్రచారం చేసింది.
తాజాగా శ్రీహాన్ మరియు సిరి ల యొక్క సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 2023 సంవత్సరం సమ్మర్లో వీరి వివాహం ఉండబోతుందట. అతి త్వరలోనే అందుకు సంబంధించిన ప్రకటన ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం వీరు ఇద్దరు సహజీవనం సాగిస్తున్నారని వార్తలు కూడా వస్తున్నాయి.