Sridevi Soda Center Review: శ్రీదేవి సోడా సెంటర్ రివ్యూ.. మాస్ లుక్‌లో కిక్ ఇచ్చిన లైటింగ్ సూరి బాబు

Sridevi Soda Center Review: సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో యాక్ట్ చేయడం ఓ ప్రయోగాత్మకమే అని చెప్పుకోవచ్చు. పలాస సినిమా డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా. ఈ సినిమా ట్రైలర్ లో కూడా ఇంటర్ కాస్ట్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దాం..

Sridevi Soda Center Review
Sridevi Soda Center Review

కథ : లైటింగ్ సూరిబాబు తన గ్రామంలో లైటింగ్స్ ఎరేంజ్ చేయడంలో ఎక్స్ పర్ట్. హీరోయిన్ తండ్రి సోడా సెంటర్ ని నడుపుతూ ఉంటారు. హీరోయిన్ ఆనందిని చూసి హీరో లవ్ లో పడటం జరుగుతాయి. ఆనంది కూడా సూరిబాబును ప్రేమిస్తుంది. కానీ హీరోయిన్ తండ్రి నరేష్ మాత్రం హీరో కాస్ట్ వేరనే కారణంతో వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోరు. ఇంతలో ఆ గ్రామంలో ఓ పెద్దమనిషి హత్యా వ్యవహారంలో సూరిబాబు చిక్కుకుంటాడు. ఈ హత్య కేసు నుండి సూరిబాబు ఎలా బయటపడతాడు. హీరోయిన్ ప్రేమను దక్కించుకోగలుగుతారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటుల నటన : సుధీర్ బాబు క్లాసీ లుక్ లోనే కాదు. ఇలా మాస్ లుక్ లో కూడా సెట్ అవుతారనే విషయం రుజువైంది. లైటింగ్ సూరిబాబుగా సెట్ అయ్యాడు. ఆనంది యాక్టింగ్ కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. పవెల్ నవగీతన్ యాక్టింగ్ కూడా చాలా బావుంది. ఇక సత్యం రాజేష్, రఘు బాబు, అజయ్ లు ఎవరి పరిధి మేరకు వారు నటించారు. హీరోయిన్ ఆనంది తండ్రి పాత్రలో నరేష్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు.

Sridevi Soda Center Movie Review and Rating
Sridevi Soda Center Movie Review and Rating

టెక్నీషియన్స్ : శ్రీదేవి సోడా సెంటర్ సినిమా స్టోరీ కొత్తదేమి కాదు. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో ఇలాంటి ఇంటర్ కాస్ట్ లవ్ స్టోరీస్ వచ్చాయి. అయితే ఈ సినిమాలో చూపించిన విధానం కొత్తగా ఉంటుంది. ముఖ్యంగా టెక్నికల్ యాక్టివిటీస్ సినిమాకి బలంగా నిలిచాయి. ప్రొడక్షన్ వాల్యూస్ తో పాటు సినిమా టేకింగ్, మ్యూజిక్, ఎడిటింగ్, కెమెరా ఇవన్నీ చక్కగా సెట్ అయ్యాయి. ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బావుంది.

విశ్లేషణ : ఒక గ్రామానికి చెందిన స్టోరీలను తెరకెక్కించే విషయంలో పలాస సినిమా ఫేమ్ డైరెక్టర్ కరుణ కుమార్ ఎప్పుడూ బెస్ట్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ కూడా రోటీన్ కి బిన్నంగా నిలవడంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.

Sridevi Soda Center Movie Review and Rating
Sridevi Soda Center Movie Review and Rating

ప్లస్ పాయింట్స్ :

  • సుధీర్ బాబు, ఆనంది
  • క్లైమాక్స్.

మైనస్ పాయింట్స్ :

  • రోటీన్ స్టోరీ
  • లెంగ్తీ రన్ టైమ్

చివరగా: శ్రీదేవి సోడా సెంటర్ సినిమా మంచి కిక్ ఇస్తుంది.

రేటింగ్: 3/5