Sridevi: శ్రీదేవి చెల్లెలు గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

Sridevi: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ శ్రీదేవి పర్సనల్ విషయాల గురించి ఇండస్ట్రీలో చాలామందికి తెలీదు. మరీ ముఖ్యంగా ఆమెకు ఒక చెల్లెలు ఉందనీ, ఆమె పేరు శ్రీలత అని ఎవరికీ తెలీదు. నిజానికి శ్రీలత అంటే శ్రీదేవికి ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయి. వారిద్దరి మధ్య ఉన్న మెమరీస్ ని శ్రీదేవి పలు సందర్భాల్లో చెప్పేవారు. ఏదైనా సినిమాలో శ్రీదేవి వేసుకున్న డ్రస్సుల్నే శ్రీలతకి కూడా కావాలంటూ మారాం చేసేవారట.

Sridevi Sister Srilatha Unknown Facts
Sridevi Sister Srilatha Unknown Facts

అలా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలిపేవారు. అలాగే శ్రీదేవి సినిమాలు షూటింగ్ అయ్యాక, రాత్రి ఏ టైమ్ కి వచ్చినా కాస్త సమయాన్నైనా సరే తన చెల్లెలితో మాట్లాడి నిద్రపోయేవారు. ఇద్దరూ కలిసి సినిమాలు చూసేవారు. శ్రీలతకు నవలలంటే ఎంతో ఇష్టం. తన చదివినవి తన అక్కతో చర్చించేది. అయితే శ్రీదేవితో పాటు శ్రీలత షూటింగ్ కు వెళ్ళేవారు కాదట.

శ్రీదేవి అమ్మకూచి అయితే శ్రీలత నాన్నకూచి. చిన్నతనంలో ఒక తెలుగు సినిమాలో అక్కాచెల్లెళ్ళుగా నటించారు. శ్రీలత చాలా మొండిఘటం, అంతే మంచితనం కూడా ఉండేదట. శ్రీదేవి నైలెక్స్ చీరలంటే ఇష్టం. కానీ శ్రీలతకు కాటన్, ఆర్గండీ చీరలంటే ఇష్టం. కానీ వారిద్దరికీ మాత్రం ఒకే రంగు చీరలు తీసుకునేవారట.

Sridevi Sister Srilatha Unknown Facts
Sridevi Sister Srilatha Unknown Facts

శ్రీదేవి ఔట్ డోర్ షూటింగ్స్ కి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు చెల్లెలికి తప్పకుండా ఏదొకటి తెచ్చేవారట. లేదంటే చాలా గొడవ చేసేవారు. ఇద్ద‌రూ ఒకే మంచం మీద ప‌డుకొనేవారు. బోలెడు క‌బుర్లు చెప్పుకొని కానీ నిద్ర‌పోయేవారు కాదుట. త‌ర్వాత కాలంలో సంజ‌య్ రామ‌స్వామి అనే వ్య‌క్తిని శ్రీ‌ల‌త పెళ్లి చేసుకుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే అక్కాచెల్లెళ్ల మ‌ధ్య ఆస్తి గొడ‌వ‌లు త‌లెత్తాయి.

దాంతో ఇద్ద‌రూ చాలా కాలం మాట్లాడుకోలేదు. దాదాపు ద‌శాబ్ద కాలం పాటు ఆ ఇద్ద‌రికీ స‌రిగా మాట‌లు లేవ‌ని చెప్పుకొనేవారు. బోనీ క‌పూర్ చొర‌వ‌తో అక్క‌చెల్లెళ్లు తిరిగి ఒక‌ట‌య్యారు. శ్రీదేవి దుబాయ్ లో మృతి చెందినప్పుడు ఆమె చెల్లెలు శ్రీలత కూడా అక్కడే ఉన్నారు.