Nagababu : మా ఇంట్లో హీరోలు నాకు ఛాన్స్ లు ఇవ్వట్లేదు.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు..!

NQ Staff - February 16, 2023 / 02:47 PM IST

Nagababu : మా ఇంట్లో హీరోలు నాకు ఛాన్స్ లు  ఇవ్వట్లేదు.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు..!

Nagababu : మెగా ఫ్యామిలీ అంటే ఇప్పుడు టాలీవుడ్‌ ను శాసించే స్థాయిలో ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోలు ఉన్న ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ అనే చెప్పుకోవాలి. అలాంటి మెగా హీరోలు తమ కుటుంబ సభ్యులకు అన్యాయం చేస్తున్నారంట. ఈ విషయాలను తాజాగా నాగబాబు చెప్పుకొచ్చాడు. ఆయన నటుడిగా, రాజకీయాల్లో చాలా బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే.

గతంలో విభిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు ఈ మెగా బ్రదర్‌ నాగబాబు. అయితే ఆయన తాజాగా ఓ సినిమాలో నటించారు. అదే శ్రీదేవి శోభన్‌ బాబు. వినడానికే కాస్త ఆసక్తికరంగా ఉన్న ఈ సినిమాను మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత, ఆయన భర్త కలిసి సహాయ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇందులో సంతోష్ శోభన్‌ హీరోగా నటించాడు.

ఆసక్తికర కామెంట్లు..

గౌరి జీ కిషన్‌ హీరోయిన్ గా చేసింది. అయితే తాజాగా నిర్వహించిన సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో నాగబాబు ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఆయన మాట్లాడుతూ.. మా ఇంట్లో ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ వారెవరూ నాకు ఛాన్సులు ఇవ్వట్లేదు. కానీ మా హానీ(సుష్మిత) ఇచ్చింది. ఆమె నాకు ఛాన్స్‌ ఇవ్వడం ఇది రెండోసారి.

ఇంతకు ముందు వెబ్‌ సిరీస్‌లో కూడా ఛాన్స్‌ ఇచ్చింది. సుష్మిత అడిగితే మా ఇంట్లో ఉన్న హీరోలు ఆమె సినిమాల్లో కచ్చితంగా నటిస్తారు. కానీ ఆమె మాత్రం అందరూ కష్టపడ్డట్టే కింది నుంచి పైకి రావాలని ఆశ పడుతోంది. అందుకే కొత్త వారితో సినిమాలు చేస్తోంది అంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us