Sridevi Drama Company : ఇమ్మాన్యుయెల్ ను వదిలేసి వేరే వ్యక్తితో తిరుగుతున్న వర్ష.. బయటపెట్టిన ఆది..!

NQ Staff - April 1, 2023 / 05:03 PM IST

Sridevi Drama Company : ఇమ్మాన్యుయెల్ ను వదిలేసి వేరే వ్యక్తితో తిరుగుతున్న వర్ష.. బయటపెట్టిన ఆది..!

Sridevi Drama Company : బుల్లితెరపై ఎన్నో ప్రేమ జంటలు ఉన్నాయి. అందులో కొన్ని ఇప్పటికే పెండ్లి పీటలు కూడా ఎక్కాయి. ఇక సుధీర్-రష్మీ తర్వాత అంతగా పాపులర్ అయిన జంట మాత్రం ఇమ్మాన్యుయెల్-వర్షది అని మాత్రమే చెప్పుకోవాలి. వీరిద్దరూ స్కిట్ లో చేస్తే చాలా ఫన్నీగా ఉంటుంది. కొన్ని సార్లు అంతే క్యూట్ గా వారిద్దరి మధ్య సీన్లు ఉంటాయి.

అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో వర్ష వేరే వ్యక్తితో తిరుగుతోంది, అతనితోనే రీల్స్ చేస్తోంది అని చెబుతాడు ఆది. చస్తే చేయదు అంటూ చెబుతాడు ఇమ్మాన్యుయెల్. స్క్రీన్ మీద వీడియోను చూపిస్తాడు. అందులో వేరే వ్యక్తితో వర్ష రీల్స్ చేస్తూ, చాలా సన్నిహితంగా కనిపిస్తుంది.

కోపానికి గురైన ఇమ్మాన్యుయెల్ ఎవడే వాడు అంటూ అడుగుతాడు. నా మీద నీకు నమ్మకం లేదా ఇమ్మూ అంటూ వర్ష చెబుతుంది. కొద్ది సేపు ఇద్దరి నడుమ వాగ్వాదం చోటు చేసుకుంటుంది. దీనంతటికీ కారణం నువ్వే అంటూ ఆదిపై సీరియస్ అవుతాడు ఇమ్మాన్యుయెల్. వీరిద్దరి నడుమ సాగిన ఈ డ్రామా అంతా చివరకు ఫన్నీగానే అని తేలుతుంది.

వారిద్దరూ జస్ట్ నవ్వులు పూయించడం కోసమే ఇదంతా చేశారన్నమాట. ఈ స్కిట్ కాస్తా ఫన్నీగానే సాగింది. దాంతో హైపర్ ఆది చివరకు ఇలా కూడా ప్లాన్ చేస్తున్నాడా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us