Sridevi : శ్రీదేవి పెళ్లి చేసుకోమని అడిగింది.. మురళీ మోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

NQ Staff - June 23, 2023 / 09:06 AM IST

Sridevi : శ్రీదేవి పెళ్లి చేసుకోమని అడిగింది.. మురళీ మోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Sridevi : అప్పట్లో శ్రీదేవికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా ఆమె అందానికి అభిమానులు ఉండేవారు. అందుకే ఆమెను అంతా అతిలోక సుందరి అంటూ పిలుచుకునేవారు. అంత అందంగా ఉండేది శ్రీదేవి. అయితే అప్పట్లో ఆమె తెలుగులో చాలామంది స్టార్ హీరోలతో కలిసి నటించింది.

ఆ సమయంలోనే తెలుగులో కొందరు హీరోలను ఆమె పెళ్లి చేసుకోనుంది అంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ వాటిపై ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఇదిలా ఉండగా తాజాగా మురళీ మోహన్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అప్పట్లో హీరోలపై చాలానే రూమర్లు వచ్చేవి.

కానీ మురళీ మోహన్ మీద మాత్రం ఎలాంటి రూమర్లు వచ్చేవి కావు. ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉండేది. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు ఆయన. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అప్పట్లో నాపై ఎలాంటి రూమర్లు రాకుండా చాలా జాగ్రత్తగా ఉండేవాడిని. అందుకే శ్రీదేవి తల్లికి నాపై మంచి నమ్మకం ఏర్పడింది.

నాకు ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేవు. కాబట్టి నాకు శ్రీదేవిని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుండు అని ఆమె అభిప్రాయపడ్డారు. శ్రీదేవి కూడా అప్పట్లో నన్ను పెళ్లి చేసుకుంటే బాగుండు అని అభిప్రాయపడింది. కానీ అదేమీ జరగలేదు. ఆమె బాలీవుడ్ కు వెళ్లి అక్కడే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us