Sri Satya : ఇవే తగ్గించుకుంటే మంచిది: శ్రీ సత్యకి పేరెంట్స్ ఝలక్.!

NQ Staff - November 24, 2022 / 06:47 AM IST

Sri Satya : ఇవే తగ్గించుకుంటే మంచిది: శ్రీ సత్యకి పేరెంట్స్ ఝలక్.!

Sri Satya : శ్రీసత్య అంటేనే పొగరు, శ్రీసత్య అంటేనే వెటకారం.! ఇవే తగ్గించుకుంటే మంచిది.. ఇదీ సోషల్ మీడియాలో నిత్యం బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీసత్య గురించి కనిపించే ట్రోలింగ్స్.

చిత్రంగా శ్రీసత్య పేరెంట్స్ కూడా ఆమెకు అదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ‘రియల్ లైఫ్‌లో అందరితోనూ ఎంత బావుంటావు.? ఇక్కడేంటి ఇలా.? ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి.? ఆ వెటకారం ఏంటి.? కోపం తగ్గించుకోకపోతే ఎలా.?’ అంటూ క్లాసులు పీకేశారు శ్రీసత్య పేరెంట్స్.

వీల్ ఛెయిర్ మీద వచ్చిన శ్రీ సత్య తల్లి…

శ్రీ సత్య తల్లి వీల్ ఛెయిర్‌లో వచ్చారు. ఆమెతోపాటుగా, శ్రీసత్య తండ్రి కూడా వచ్చారు. తాను లేకపోవడంతో తన తల్లికి సపర్యలు చేసేవారెవరూ లేకుండా పోయారంటూ, తన తల్లిదండ్రులు వెళ్ళాక వాపోయింది శ్రీ సత్య. వాళ్ళు చెప్పలేదు గానీ, తనకే విషయం అర్థమయిపోయిందని శ్రీసత్య కంటతడి పెట్టింది.

కాగా, ఎలిమినేషన్ కోసం జరిగే నామినేషన్ సందర్భంగా సిల్లీ రీజన్స్ చెప్పొద్దంటూ శ్రీసత్యకు చురకలంటించారు ఆమె తండ్రి. ‘ఆట బాగానే వుంది. కానీ, కొన్ని మార్చుకోవాలి. నువ్వు ఈ స్థాయికి ఎదుగుతావని అనుకోలేదు. టైటిల్ ముఖ్యం.. బాగా ఆడు..’ అంటూ తన కుమార్తెకు టిప్స్ ఇచ్చారు శ్రీసత్య తల్లిదండ్రులు.

‘మీరందరూ కూడా నామినేషన్స్ సందర్భంగా సిల్లీ రీజన్స్ చెప్పకూడదు’ అని ఇతర కంటెస్టెంట్లకూ శ్రీ సత్య తల్లిదండ్రులు సూచించారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us