Sri Reddy Targeting Pawan kalyan : వాడు దేవుడు కాదు.. కామాంధుడు.. పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి మరో దుమారం..!
NQ Staff - July 28, 2023 / 01:11 PM IST
Sri Reddy Targeting Pawan kalyan :
అదేంటో గానీ.. శ్రీరెడ్డికి ఏ మాత్రం గ్యాప్ దొరికినా సరే పవన్ కల్యాణ్ తిట్టడమే పనిగా పెట్టుకుంటోంది. ఆమె గతంలో మీటూ ఉద్యమ సమయం నుంచి మెగా ఫ్యామిలీనే ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. అందులోనూ పవన్ కల్యాణ్ అంటే చాలు ఒంటికాలి మీదనే లేస్తోంది ఈ హాట్ బ్యూటీ. ఇక పవన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకాస్త ఎక్కువనే చేస్తోంది.
ఇక తాజాగా పవన్ కల్యాణ్ నటించిన మూవీ బ్రో ది అవతార్. ఇందులో ఆయన కాలం అంటే దేవుడిగా కనిపించాడు. సాయిధరమ్ తేజ్ కూడా ఇందులో ఉన్నాడు. అయితే సినిమా చూసిన వారంతా పవన్ కల్యాన్ సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా దేవుడే అంటూ రివ్యూలు ఇస్తున్నారు.
తిట్టిపోసిన శ్రీరెడ్డి..
ఇంకేముంది ఈ విషయంకాస్తా శ్రీరెడ్డి చెవిన పడ్డట్టు ఉంది. దాంతో పవన్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తోంది. అరేయ్.. పిచ్చి సన్నాసుల్లారా పవన్ కల్యాణ్ దేవుడు కాదురా కామాంధుడు. ఎంతో మంది ఆడవారి జీవితాలతో ఆడుకున్న దుర్మార్గుడు. అలాంటి వాడికి మీరు ఎందుకు అంతగా ఎఫెక్ట్ అవుతున్నారు.
ఇదెలా ఉందంటే.. పాపాలు చేసిన వాడే పుణ్యం ప్రసాదించినట్టు ఉంది. బ్రో సినిమాలో ఆయన దేవుడి గెటప్ లో ఉండి బీడీ కాల్చి ఐటెం భామలతో సరసాలు ఆడుతాడా అంటూ ఫైర్ అయింది శ్రీరెడ్డి. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. కాగా శ్రీరెడ్డిపై పవన్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.