Sri Reddy: అప‌హాస్యం చేయ‌కండి.. రేపో మాపో మీరు, మీ హీరో కూడా పోతాడంటూ శ్రీ రెడ్డి కామెంట్

Sri Reddy: ఈ మ‌ధ్య కాలంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు ఉప‌యోగించుకొని చాలా మంది ఫేమ‌స్ అవుదామ‌ని చూస్తున్నారు. క‌త్తి మ‌హేష్ వీలున్న‌ప్పుడ‌ల్లా ప‌వ‌న్‌పై ఏదో ర‌క‌మైన సెటైర్స్ వేస్తూ హెడ్ లైన్స్‌లో నిలుస్తూ వ‌చ్చాడు. ఇక కాస్టింగ్ కౌచ్ అంటూ పోరాటం మొద‌లు పెట్టిన శ్రీరెడ్డి.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆయ‌న ఫ్యాన్స్‌ని ఏదో ర‌కంగా గెలుకుతూనే ఉంటుంది. కొంద‌రు చిన్నా చిత‌కా రాజ‌కీయ నాయ‌కులు కూడా ప‌వ‌న్‌ని టార్గెట్ చేస్తూ ఫేమ‌స్ అవుతున్నారు.

Sri Reddy

అయితే కత్తి మ‌హేష్ ఎక్కువ‌గా ప‌వ‌న్ గురించి సోష‌ల్ మీడియాలో వివాదాస్ప‌ద ట్వీట్స్ చేస్తుండ‌డంతో ఆయ‌న‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఆడ‌కునే వారు. ఈ క్ర‌మంలో క‌త్తి మ‌హేష్‌కి, ప‌వ‌న్ ఫ్యాన్స్ కి భీబ‌త్స‌మైన వార్ న‌డిచేది. అయితే అనూహ్యంగా శనివారం రోజు కత్తి మహేష్ కన్నుమూయడంతో సినీ వర్గాల నుంచి చాలామంది ప్రముఖులు సంతాపం తెలపగా.. కొంతమంది నెటిజన్లు మాత్రం ఆయన మృతిపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

జూన్ 26వ తేదీన నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా కొడవలూరు హైవే వద్ద కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు.. లారీని బలంగా ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన కారు నుజ్జు నుజ్జు అయ్యింది. కత్తి మహేష్ సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల తలతో పాటు కన్నుకి బలమైన గాయాలు కావడంతో హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. దాదాపు 10 రోజుల పాటు ఆసుప‌త్రిలో చికిత్స పొందిన క‌త్తి ఊహించ‌ని విధంగా మార‌ణించారు.

క‌త్తిమ‌హేష్ మ‌ర‌ణంపై ప‌వ‌న్ ఫ్యాన్స్ కొంద‌రు పాజిటివ్‌గా కామెంట్స్ చేస్తుండ‌గా, కొంద‌రు మాత్రం చేసిన ప‌నికి శాస్తి జ‌రిగిదంటూ కామెంట్స్ చేశారు. దేవుడిని వ‌ద‌ల‌లేదు, మంచి వ్య‌క్తుల‌ని వ‌ద‌ల‌కుండా స్వ‌లాభం కోసం ఆయ‌న చేసిన ప‌నుల‌కు ఇలా జ‌రిగింద‌ని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని రెచ్చగొడుతూ తనదైన శైలిలో షాకింగ్ కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి.

”అందరూ వెనక, ముందు పోవాల్సిందే.. కత్తి మహేష్ మరణాన్ని కూడా పండగలా చెప్పుకునేవాళ్ళకి అపహాస్యం చేసేవాళ్ళకి ఇదే నా ఆన్సర్. రేపో ఎల్లుండో మీరు కూడా పోవాలి, మీ హీరో కూడా పోతాడు.. మీరేదో యుగపురుషులు లాగా ఎందుకురా పోజులు?? బుర్ర అప్పుడప్పుడు వాడండి.. కత్తి మహేష్ ఆత్మకు శాంతి చేకూరాలి” అంటూ శ్రీ రెడ్డి తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. దీంతో నెక్స్ట్ నువ్వే పోయేది.. రెడీగా ఉండు అంటూ రివ‌ర్స్ పంచ్‌లు వేస్తున్నారు.