SRI REDDY: ద‌గ్గుబాటి వార‌సుడిపై శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్.. మ‌రి కొన్ని ఫొటోలు వ‌దల‌మంటూ నెటిజ‌న్స్ సూచ‌న‌లు

శ్రీ రెడ్డి.. ఒక‌ప్పుడు తెలుగు రాష్ట్రాల‌లో వైబ్రేష‌న్స్ సృష్టించిన పేరు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ప‌లు సినిమాల‌లో న‌టించిన శ్రీ రెడ్డి ఒక్క‌సారిగా త‌న జూలు విదిల్చి జ‌ర‌గుతున్న అన్యాయాలని ఖండించే ప్ర‌యత్నం చేసింది. ఈ క్ర‌మంలో పెద్ద హీరోల‌పై కూడా త‌న‌దైన స్టైల్‌లో పంచ్‌లు వేసింది. ఓ స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై కూడా దారుణ‌మైన కామెంట్స్ చేయడంతో ఆయ‌న మా ఛాంబ‌ర్‌కి వ‌చ్చి త‌నకు న్యాయం జ‌ర‌గాలంటూ కొద్ది గంట‌ల పాటు అక్క‌డే వేచి ఉన్న ప‌రిస్థితి. కొద్ది రోజుల త‌ర్వాత ఈ అమ్మ‌డు టాలీవుడ్‌ని వ‌దిలి చెన్నైకు వెళ్లింది. అక్కడ‌కు వెళ్లిన మ‌న స్టార్స్‌ని మాత్రం వ‌ద‌ల‌డం లేదు.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న శ్రీ రెడ్డి ప్ర‌తి నిత్యం ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉంటుంది. ఈ క్ర‌మంలో ఆమెకు విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ పోతుంది. అయితే శ్రీరెడ్డి త‌న సోష‌ల్ మీడియాలో ద‌గ్గుబాటి వార‌సుడు అభిరామ్‌తో లిప్ కిస్ ఇస్తున్న ఫొటోల‌ను షేర్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది. ఈ ఫొటోలు తెలుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌ని నోరెళ్ల‌పెట్టేలా చేశాయి. ఈ ఉదంతం త‌ర్వాత హీరో నానిపై కూడా సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. ఆయ‌న‌కు సంబంధించిన ఫొటోలు కూడా వ‌దులుతుందేమో అని అనుకున్నారు. కాని అది జ‌ర‌గ‌లేదు. తాజాగా రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణం రాజుని ఓ రేంజ్‌లో ఆడుకుంటూ వరుస పోస్ట్‌లు చేస్తుంది.

అలానే ఆర్ఆర్ఆర్‌ని ఉద్దేశిస్తూ కూడా శ్రీ రెడ్డి ఓ పోస్ట్ షేర్ చేయ‌గా, ఆమె హేటర్స్ కొంతమంది ఎప్పటిలాగే ఆమెపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంలో ఓ నెటిజన్ శ్రీరెడ్డి-అభిరామ్‌ల లిప్ లాక్ రొమాన్స్ ఫొటోని షేర్ చేశాడు. దీనిపై స్పందించిన శ్రీ రెడ్డి , ఇంకెంతసేపూ వీడి మూతేనా?? ఇంకెవడి మూతి అయినా పెట్టి మీమ్స్ చేయండ్రా? అంటూ కౌంటర్ ఇచ్చింది. అయితే తప్పకుండా పెడతాం.. నీ లిస్ట్‌లో ఉన్న ఇంకొన్ని ఫొటోలు వ‌దులు మ‌రి నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైన శ్రీ రెడ్డి ఇటు సినిమా అటు రాజ‌కీయ ప్ర‌ముఖుల‌ని త‌న పోస్ట్‌ల‌తో షేక్ చేస్తుండడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.