Sri Reddy : త్వరలోనే ఆ పని చేయబోతున్న శ్రీరెడ్డి.. వణికిపోతున్న దగ్గుబాటి రానా..!
NQ Staff - January 20, 2023 / 10:16 AM IST

Sri Reddy : శ్రీరెడ్డి.. ఈ పేరు సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అవుతుందో మనందరికీ తెలిసిందే. ఆమె కాంట్రవర్సీలకు
కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి ఆరోపణలు చేస్తుందో ఎవరికీ తెలియదు. ఇక ఆమె ఆరోపణలతో ఎక్కువగా బలైపోయింది మాత్రం దగ్గుబాటి అభిరామ్ అని చెప్పుకోవాలి. రానా తమ్ముడు అభిరామ్ తనను చాలాసార్లు వాడుకున్నాడని శ్రీరెడ్డి ఆరోపించింది.
రామానాయుడు స్టూడియోలోనే తమకు శోభనం జరిగిందంటూ సంచలనం రేపింది. ఇక అప్పటి నుంచి అభిరామ్ మీద ఎన్నో ఆరోపణలు చేస్తోంది. కాగా ఇప్పుడు అభిరామ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. తేజ దర్శకత్వంలో అహింస అనే మూవీని చేస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు కూడా అట్టర్ ప్లాప్ అవుతుందని శ్రీరెడ్డి శాపనార్థాలు పెట్టింది.
రానాతో ప్రమోషన్..
అయితే ఇప్పుడు రానా మీద శ్రీరెడ్డి పగ పెంచుకుంటుందంట. ఎందుకంటే రానా ఇప్పుడు తమ్ముడి మూవీ కోసం సిద్ధం అవుతున్నాడు. అహింస మూవీకి పెద్దగా బజ్ రావట్లేదు. అందుకే సురేష్ బాబు తన పెద్ద కొడుకు రానాను రంగంలోకి దింపుతున్నాడు. రానాతో ప్రమోషన్ చేయించాలని అనుకుంటున్నారు సురేష్ బాబు.
ఇన్ని రోజులు శ్రీరెడ్డి రానా జోలికి వెళ్లలేదు. కానీ ఇప్పుడు రానాను టార్గెట్ చేయడానికి రెడీ అవుతోందంట. తనను మోసం చేసిన అభిరామ్ మూవీకి సపోర్టు చేస్తున్నందుకు గాను.. రానా మూవీలకు నెగెటివ్ ప్రమోషన్ చేయడానికి రెడీ అవుతోంది. అంతే కాకుండా రానాకు సంబంధించిన సీక్రెట్లను బయట పెట్టేందుకు సిద్ధం అవుతోందంట. ఈ విషయం ఇప్పుడు దగ్గబాటి ఫ్యామిలీని షేక్ చేస్తోంది.