శ్రీ రెడ్డి బాధ వ‌ర్ణ‌నాతీతం.. ఇద్ద‌రు స్నేహితులు సూసైడ్, అంత‌లోనే క‌త్తి మ‌హేష్ మ‌ర‌ణం..

వివాదాల‌తో వార్త‌ల‌లో నిలిచే వారిలో శ్రీ రెడ్డి ఒక‌రు. కాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లో హ‌ల్ చ‌ల్ చేసిన శ్రీ రెడ్డి ఇప్ప‌టికీ తెలుగు ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురిని టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న కామెంట్స్ చేస్తుంటుంది. ఇప్పుడు ఈ భామ తీవ్ర విషాదంలో మునిగింది. గ‌త కొంత కాలంగా ఫేస్ బుక్‌కి దూరంగా ఉన్న శ్రీ రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిన‌ట్టు చెప్పుకొచ్చింది.

Sri Reddy Feel About Kathi Mahesh Death
Sri Reddy Feel About Kathi Mahesh Death

తనకు ఇద్దరు స్నేహితులు దూరమయ్యారని ఇద్దరూ సూసైడ్ చేసుకుని మరణించారని చెబుతూ శ్రీరెడ్డి నిన్న రాత్రి పోస్ట్ పెట్టారు. ప్రస్తుతానికి తాను డిప్రెషన్ లో ఉన్నానని, త్వరలో డిప్రెషన్ నుంచి బయటపడతానని, డిప్రెషన్ నుంచి బయట పడడానికి ప్రయత్నిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. ఇంత‌లోనే త‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన క‌త్తి మ‌హేష్ రోడ్డు ప్ర‌మాదానికి గురై క‌న్నుమూయ‌డం ఆమెకు చాలా బాధ‌ను క‌లిగించింది.

శ్రీరెడికి, క‌త్తి మ‌హేష్‌కి మ‌ధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇద్ద‌రు ప‌లు విష‌యాల‌పై క‌లిసి పోరాటం చేశారు. క్యాస్టింగ్ కౌచ్ గొడవ జరిగిన అనంతరం ఆమె హైదరాబాద్ నుంచి చెన్నై మకాం మార్చేసిన సంగతి తెలిసిందే. అక్కడే ఉండి కొన్ని యూట్యూబ్ చానల్స్ రన్ చేస్తూ ఫేస్ బుక్ వీడియోల ద్వారా ఆదాయం సంపాదిస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియా ద్వారా ప‌లు విష‌యాల‌పై స్పందిస్తూ ఉంటుంది.

ఆ మ‌ధ్య జగనన్న తనకు అవకాశం ఇస్తే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబు, లోకేష్ లాంటి వాళ్ళకి బుద్ధి చెబుతాం అని కూడా ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఇప్ప‌టికే ఇద్ద‌రు స్నేహితుల‌ని కోల్పోయిన శ్రీ రెడ్డి ఇప్పుడు మ‌రో స్నేహితుడుని కోల్పోవ‌డం ఆమెకు తీర‌ని విషాదాన్ని మిగిల్చింది.

క‌త్తి మ‌హేష్ కారు జూన్ 26న నెల్లూరులోని కొడవలూరు హైవే వద్ద లారీని ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ యాక్సిడెంట్‌లో కత్తి మహేష్ సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల తలతో పాటు కన్నుకి బలమైన గాయాలు అయ్యాయి. దీంతో ఆయన్ని హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడం ప్రారంభించారు. అయితే ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆయన శనివారం కన్నుమూశారు.