Sri Reddy: స‌మంత‌- చైతూ పై శ్రీ రెడ్డి కామెంట్స్.. అవాక్క‌వుతున్న నెటిజన్స్

Sri Reddy: క్యాస్టింగ్ కౌచ్ అంశంతో టాలీవుడ్‌లో నానా ర‌చ్చ చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది శ్రీ రెడ్డి. ఇక అప్ప‌టి నుండి ఈ అమ్మ‌డు ఇష్ట‌మోచ్చిన‌ట్టు కామెంట్స్ చేయడం,సోష‌ల్ మీడియాలో అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేయ‌డం చూస్తూనే ఉన్నాం. ఆమె ఏం మాట్లాడినా, ఏదైనా పోస్ట్ చేసినా కూడా అది ఓ సెన్సేషన్ అవుతుంది. తన పర్సనల్ విషయాల దగ్గరి నుంచి ప్రస్తుతం జరుగుతున్న ట్రెండింగ్ వరకు ఏదో ఒక పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.

Sri Reddy Comments on Samantha and Naga Chaithanya
Sri Reddy Comments on Samantha and Naga Chaithanya

ఆమె మాట్లాడ‌ని అంశం లేదు, ఇష్యూ చేయ‌ని టాపిక్ లేదు. సినీ, రాజ‌కీయ‌, క్రీడా ప్ర‌ముఖుల‌పై కూడా విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్న శ్రీ రెడ్డి తాజ‌గా స‌మంత‌-నాగ చైత‌న్య బంధం గురించి వ‌స్తున్న వార్త‌ల‌పై పాజిటివ్‌గా స్పందించింది. కొద్ది రోజులుగా నాగ చైత‌న్య‌- సమంత విడిపోతున్నార‌ని తెగ వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే.కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా వారు త‌మ నిర్ణ‌యం మార్చుకోలేంద‌టూ వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఈ క్ర‌మంలో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీ రెడ్డి.. వారిద్దరు ఇండస్ట్రీలో స్వీట్ అండ్ క్యూట్ కపుల్ అని గుర్తుచేశారు. వారిపై తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని కోరారు. పుకార్లు ఎందుకు సృష్టిస్తున్నారని అడిగారు. ఇదీ సరికాదని సూచించారు. తీరు మార్చుకోవాలని హితవు పలికారు. చై, సామ్ గురించి శ్రీ రెడ్డి పాజిటివ్ గా మాట్లాడడంతో పాటు నెటిజన్లకు సూచనలు చేయ‌డం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

శ్రీ రెడ్డి కొన్నాళ్లుగా సోష‌ల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. డిప్రెషన్ అనే ప్రాబ్లమ్ వల్ల తాను చాలా బాధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తుంది. మధ్యలో హైదరాబాద్‌కి కూడా వచ్చాను.. ట్రీట్ మెంట్ తీసుకుంటున్నా.. నాకు జబ్బులు దాచుకోవాల్సిన అవసరం లేదన్నారు శ్రీ రెడ్డి. స్ బుక్‌కి దూరంగా ఉన్నాను కానీ.. యూట్యూబ్‌కి సంబంధించి కొన్ని వీడియోలు బ్యాకప్ చేస్తున్నా.. వరుసగా వీడియోలను రిలీజ్ చేస్తానని క్లారిటీ ఇచ్చారు శ్రీరెడ్డి