Sri Reddy: చైతూ-సామ్‌ల‌కు నీతులు బోధిస్తున్న శ్రీ రెడ్డి.. భ‌లే బాగుందే..!

Sri Reddy: కాస్టింగ్ కౌచ్ వివాదం త‌ర్వాత శ్రీ రెడ్డి పేరు మారు మ్రోగిపోయింది. ఈమె కూడా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేందుకు ప‌లువురు సెల‌బ్రిటీల‌పై కామెంట్స్ చేయ‌డం, హాట్ హాట్ షోల‌తో హీటెక్కించ‌డం వంటివి చేసింది. అయితే ఇటీవ‌ల అనారోగ్యం బారిన ప‌డ్డ శ్రీ రెడ్డి నీతులు బోధిస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

Sri Reddy Comments On Samantha and Naga Chaitanya Issue
Sri Reddy Comments On Samantha and Naga Chaitanya Issue

దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ కపుల్స్ సమంత, నాగచైతన్య అక్కినేని దాంపత్య జీవితంలో కలతలు చోటుచేసుకొన్నాయని, వారిద్దరూ విడిపోవడానికి నిశ్చయించుకొన్నారనే వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి. గత కొద్ది రోజులుగా నాగచైతన్య అక్కినేని, సమంత విడిపోయారనే వార్త వైరల్ అవుతున్నది. దీనిపై ఇద్ద‌రు స‌రైన క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో అనుమానాలు మ‌రింత రెట్టింపు అయ్యాయి.

నటి శ్రీరెడ్డి ఇటీవ‌ల వారిద్దరి బ్రేకప్‌పై ఘాటుగా స్పందించారు. నాగచైతన్య, సమంత దంపతులకు సానుకూలమైన ట్వీట్ చేసింది. సమంత, నాగచైతన్యను ట్యాగ్ చేస్తూ లవ్ స్టోరీ ట్రైలర్ గురించి ట్వీట్ చేసింది. సమంత, నాగచైతన్యపై రూమర్లు వద్దు సినిమా పరిశ్రమలో సమంత, నాగచైతన్య అక్కినేని బెస్ట్ కపుల్. వాళ్లిద్దరూ చాలా స్వీట్ అండ్ క్యూట్‌గా ఉంటారు. అలాంటి దంపతుల జీవితంపై తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు అని పేర్కొంది.

తాజాగా స‌మంత‌కు జీవిత పాఠాలు చెప్పుకొచ్చింది. సమంతపై నాకు చాలా గౌరవం ఉంది. ఒకటి ఫెయిల్ అయితే ఇంకోటి, అది కూడా ఫెయిల్ అయితే ఇంకోటి వస్తాయి. కానీ మేం అది కోరుకోవడం లేదు. నాగచైతన్య-సమంత కలిసి ఉండాలి. ప్రతి ఒక్కరికి యాటిట్యూడ్, ఇగోలు ఉంటాయి. కానీ కాస్త సర్దుకుంటేనే జీవితం అని నేను నమ్ముతాను. కాబట్టి సమంత సర్దుకుకోవాలి. సమంత మాత్రమే కాదు, నాగచైతన్య అన్నయ్య కూడా సర్దుకోవాలి అని పేర్కొంది.

చైతూ-సమంత కూర్చొని తమ సమస్యల్ని పరిష్కరించుకోవాలని సూచిస్తోందియ శ్రీ రెడ్డి. వారు నలుగురికి ఆదర్శంగా ఉండాలి కాని, విడిపోవడం తనకు ఇష్టం లేదని అంటోంది. మనం ఎంత ప్రయత్నించినా హాలీవుడ్ మోడల్స్ లా తయారవ్వలేమని, ఈ విషయాన్ని సమంత గుర్తుపెట్టుకోవాలని అంటోంది శ్రీరెడ్డి. ఇప్పటికైనా సమంత వదిన వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకొని చక్కగా సంసారం చేసుకోవాలని శ్రీరెడ్డి సలహా ఇస్తోంది.