Sri Reddy: నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న వారు మీకు ఏం చేయరు… పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి సంచలన కామెంట్స్..!

Sri Reddy: టాలీవుడ్‌లో వివాదాలకు కేరాఫ్‌గా ఉండే శ్రీరెడ్డి.. ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లో ఉండే ప్రయత్నం చేస్తుంటుంది. తాజాగా ఈమె మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎలక్షన్స్‌పైన సంచలన కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి తనను గురించి సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేసే వారిని హెచ్చరించింది.

Sri Reddy Comments On Pawan Kalyan
Sri Reddy Comments On Pawan Kalyan

మూవీ ఆర్టిస్ట్ అసోయేషన్ (మా) ఎలక్షన్స్ జరిగిన తీరును బట్టి ఆర్టిస్టులందరికీ కొన్ని విషయాలు అర్థమయ్యాయని శ్రీరెడ్డి అంది. సినిమా ఇండస్ట్రీలో గ్రేట్ ఆర్టిస్టులుంటే వారు ఆర్టిస్టులు మాత్రమేనని, అనవసరంగా వారిని దేవుళ్లను చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. దున్నపోతు దేంట్లోనో పడి మేసిన చందంగా ఎన్నికలు జరిగిన తీరును అర్థం చేసుకోవచ్చని తెలిపింది. నాలుగు లేదా ఐదు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు కరెక్ట్ పర్సన్స్ కాదన్న సంగతి ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించింది. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నటువంటి వారు దేశ సేవకు పనికిరారని పేర్కొంది. ఇప్పటికైనా ప్రజలు కళ్లు తెరవాలని, హితబోధ చేసింది శ్రీరెడ్డి.

ప్రతీ సారి మా కులపోడు, ఫేవరెట్ యాక్టర్ అంటూ ప్రజలు తిరగాల్సిన అవసరం లేదని అంది.
ముందు ఆర్థికంగా ఎదగాలని, అలా ఎదిగిన తర్వాత ఎవరైనా తమ కుటుంబ సభ్యులను, భార్యలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పింది శ్రీరెడ్డి. మీ గర్ల్ ఫ్రెండ్స్‌ను దక్కించుకునేందుకుగాను అనుకున్న లక్ష్యాలను రీచ్ కావాలని, అందుకు మీరు ప్రయత్నాలు చేయాలని సూచించింది. జీవితంలో చేయాల్సిన పనులు బోలెడున్నాయని, కాని అవేవీ పట్టించుకోకుండా అనవసరంగా కొందరు టైం వేస్ట్ చేస్తున్నారని అభిప్రాయపడింది.

ఈ నేపథ్యంలోనే తనపైన యూట్యూబ్ లేదా సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేసే వారిని శ్రీరెడ్డి హెచ్చరించింది. ముందు మీరు మీ జీవిత లక్ష్యాలను రీచ్ కావాలని, అలా చేసి మీ కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వండని సూచించింది. అయితే, శ్రీరెడ్డి చేసిన నాలుగు పెళ్లిళ్ల కామెంట్ పరోక్షంగ జనసేనాని పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి చేసిందేనని పలువురు అంటున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎలక్షన్స్ ముగిసిన నేపథ్యంలో మా అధ్యక్షుడి ఎన్నికైన మంచు విష్ణు ఆఫీసులో బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆనవాయితీ ప్రకారం చేయాల్సిన ప్రమాణ స్వీకారం ఈ నెల 16న ఉదయం 11.45 గంటలకు చేయనున్నారు.