Sri Reddy: ఒంటి మీద బట్టలెక్కడున్నాయి హేమ‌.. ఆ గంతులేంటి ప్రగతిః శ్రీరెడ్డి దారుణ వ్యాఖ్యలు

Sri Reddy: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎలక్షన్స్ జరిగి మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ ఎన్నికలు జరిగిన తీరుపై తాజాగా నటి శ్రీరెడ్డి స్పందించింది. ఎన్నికల సందర్భంగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు ప్రవర్తించిన తీరును తప్పుబట్టింది.

Sri Reddy Comments On MAA Association
Sri Reddy Comments On MAA Association

మూవీ ఆర్టిస్టులకు సేవ చేసేందుకుగాను మా ఎన్నికల్లో పాల్గొనపుడు సేవ చేయడం కోసం అంతగా పరితపించాల్సిన అవసరం ఏముందని శ్రీరెడ్డి ప్రశ్నించింది. ఒకవేళ మీరు సేవ చేయలేనపుడు మీ స్థానంలో వేరే వారు చేస్తారు కదా అని నటి హేమ, ప్రగతిని అడిగింది. మా ఎలక్షన్స్ రోజున హేమకు తన ఒంటి మీద బట్టలు ఎక్కడున్నాయో కూడా తెలియలేదని, ప్రగతి ఆ తీరుగా గంతులేయాల్సిన అవసరమేంటని అంది శ్రీరెడ్డి. తాను గతంలో ఓ పని చేసినప్పుడు అంత పబ్లిసిటీ అవసరమా అని అడిగిన వారు ఇప్పుడు చేసిందేమిటి అని అన్నది.

ఇకపోతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎలక్ట్ అయినపుడు మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన మాటలను బట్టి ఆయన మనసులో ఏదో ఉందని ఆరోపించింది. చిరంజీవికి విష్ణు మా అధ్యక్షుడు కావడం ఇష్టం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబు, పవన్ కల్యాణ్ డైరెక్షన్‌లోనే ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామాల పర్వానికి తెరలేపారని విమర్శించింది. మెగాస్టార్ తనకున్న ఇండస్ట్రీ ఎక్స్‌పీరియెన్స్ చూసుకుని మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడు అవడాన్ని తట్టుకోవడం లేదని తెలిపారు.

ఈ క్రమంలోనే మెగా బ్రదర్స్ కుట్రలు చేస్తున్నారట్లుగా విమర్శలు చేసింది శ్రీరెడ్డి. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాను ఈసీ మీటింగ్‌లో డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుంటామని విష్ణు ప్రకటించారు. ఇకపోతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఎన్నికైన మంచు విష్ణు ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు. అయితే, ప్రమాణ స్వీకారం చేయలేదు. ఈ నెల 16న ఉదయం 11.45 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తాజాగా విష్ణు తెలిపారు.