BALA KRISHNA: బాల‌య్య నోటీ శ్రీరామ‌దండ‌కం పాట‌.. వైర‌ల్‌గా మారిన వీడియో

ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా ఎన్టీఆర్ ఎప్ప‌టికీ అంద‌రి మ‌న‌సుల‌లో కొలువై ఉంటారు. సినీ వినీలాకాశంలో ఓ వెలుగు వెలుగుతూ అందాల రాముడిగా, కొంటె కృష్ణుడిగా, ఏడు కొండల వాడిగా ఇలా అన్ని వేషాలు వేసి ప్రేక్షకుల నీరాజనాలందుకున్నారు ఎన్టీఆర్.ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రు ఎన్టీఆర్ ఖ్యాతిని స్మ‌రించుకుంటున్నారు. అలానే నంద‌మూరి తార‌క‌రామారావు వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాల‌కృష్ణ త‌న తండ్రి జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న గొప్ప తనాన్ని గుర్తు చేసుకుంటూ శ్రీరామ‌దండ‌కాన్ని ఆల‌పించారు.

బాల‌య్య నోటి నుండి వ‌చ్చిన శ్రీరామ దండకం ఎన్టీఆర్ అభిమానుల‌తో పాటు నంద‌మూరి అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. బాలయ్య నిర్మాణ సంస్థ నందమూరి బాలకృష్ణ ఫిల్మ్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది. మీరు కూడా ఈ వీడియోపై ఒక లుక్కేయండి. ఇక ప్ర‌స్తుతం బాల‌కృష్ణ త‌న ఫేవ‌రేట్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో అఖండ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మేలో విడుద‌ల కావ‌ల‌సి ఉండ‌గా, క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డింది. ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి విడుద‌లైన టీజ‌ర్ ఫ్యాన్స్ కు పిచ్చెంక్కించింది.