Bigg Boss: బిగ్ బాస్ లీక్.. ఫినాలేకు డైరెక్ట్‌గా పాపుల‌ర్ సింగ‌ర్

Bigg Boss:బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్యక్ర‌మంలో టికెట్ టూ ఫినాలే జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ టాస్క్‌లో చివ‌రి ద‌శ‌కు ఎవ‌రు చేరుకుంటారో అని అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొని ఉంది. అయితే తొలి టాస్క్‌లో ఐస్‌ వాటర్‌ నుంచి బయటకు వచ్చిన ఇంటి సభ్యులకు కాళ్ళపై వేడినీళ్లు పోయడం ప్రమాదమని బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

sri ram finale in bigg boss
sri ram finale in bigg boss

బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చినా పట్టించుకోని ప్రియాంక సింగ్.. శ్రీరామచంద్రకు అర్ధరాత్రి జండూ భామ్‌ రాసి కాళ్లపై వేడినీళ్లు పోసి మసాజ్‌ చేయడంతో శ్రీరామచంద్ర నొప్పి మరింత ఎక్కువైంది. వెంటనే శ్రీరామచంద్రని మెడికల్‌ రూమ్‌లోకి పిలిచి మందులు ఇచ్చారు. ప్ర‌స్తుతం అత‌ను గేమ్ ఆడ‌లేక‌పోతున్నాడు.

ఇప్పటివరకు కొనసాగిన గేమ్‌లో కాజల్‌, ప్రియాంక సింగ్‌, షణ్ముఖ్‌ అవుట్‌ అవగా సన్నీ, శ్రీరామ్‌, సిరి, మానస్‌ టాప్‌ 5లో బెర్తు దక్కించుకోవడం కోసం పోటీపడుతున్నారు. అయితే సిరి ఫినాలే టికెట్‌ సొంతం చేసుకుని ఫైనల్‌లో అడుగు పెట్టిందంటూ సోషల్‌ మీడియాలో నిన్నటి నుంచి తెగ ప్రచారం జరిగింది.

అయితే ఇంకా టాస్క్‌ పూర్తవలేదని, అది కేవలం ఊహాగానాలేనని పలువురూ పేర్కొన్నారు. కానీ ఎస్‌ అక్షరంతో ప్రారంభమయ్యే కంటెస్టెంట్‌ గెలుస్తున్నారంటూ క్లూ ఇచ్చారు. దీంతో సిరి, శ్రీరామ్‌, సన్నీలలో ఒకరు ఫినాలేకు వెళ్తారని అంతా అనుకుంటున్నారు.

sri ram finale in bigg boss1
sri ram finale in bigg boss1

ఈ సమయంలో టికెట్‌ టు ఫినాలే పోటీ ముగిసిందంటూ, విన్నర్‌ ఎవరో తెలిసిపోయిందంటూ నెట్టింట లీకువీరులు హల్‌చల్‌ చేస్తున్నారు. అందరూ అనుకున్నట్లుగా సిరి కాకుండా శ్రీరామ్‌ గెలిచాడని చెప్తున్నారు. ఇప్పటివరకు వాళ్లు చెప్పినవేవీ నిజం కాకుండా పోలేదు, దీంతో ఈ వార్త నిజమే అయి ఉంటుందంటూ శ్రీరామ్‌ ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు.

ఐస్‌ క్యూబ్స్‌లో నిలబడాల్సిన టాస్క్‌లో శ్రీరామ్‌ పాదాలు స్పర్శ కోల్పోయిన విషయం తెలిసిందే కదా! అప్పటి నుంచి ఫిజికల్‌ టాస్క్‌ల్లో శ్రీరామ్‌కు బదులు సన్నీ ఆడుతున్నాడు. తన ఆటలో వెనకబడిపోయినా సరే శ్రీరామ్‌ను మాత్రం గేమ్‌లో ముందు వరుసలో ఉంచుతున్నాడు. దీంతో శ్రీరామ్‌ను సన్నీ గెలిపించాడంటూ సన్నీ ఫ్యాన్స్‌ కూడా అతడిని ఆకాశానికెత్తుతున్నారు.