Sreemukhi: అలా పరువు తీసేసింది.. జబర్దస్త్ నరేష్, హరిలను ఆడుకున్న శ్రీముఖి

Sri mukhi fun with Express hari and Jabardasth Naresh
Sri mukhi fun with Express hari and Jabardasth Naresh

Sreemukhi బుల్లితెరపై శ్రీముఖి ఎంత సరదాగా, అల్లరల్లరి చేస్తుందో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా శ్రీముఖికి తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను వేసుకుంది. ఏకంగా బుల్లితెర రాములమ్మగా అందరి హృదయాలను కొల్లగొట్టేసింది. ఒసేయ్ రాములమ్మ పాటను తనదైన శైలిలో కొత్త స్టెప్పులతో అందరికీ మళ్లీ పరిచయం చేసింది. ఒకప్పుడు శ్రీ ముఖి వేసే ఆ స్టెప్పులు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతూ ఉండేవి.

అలా బుల్లితెరపై పటాస్ షోలో శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా ఉండేది కాదు. అయితే పటాస్ షో పీక్స్‌లోఉండగానే శ్రీముఖి బిగ్ బాస్ షోకు వెళ్లాల్సి వచ్చింది. అలా పటాస్‌ను మధ్యలోనే వదిలేసింది శ్రీముఖి. ఆ సమయంలో యాంకర్ రవి, పటాస్ కంటెస్టెంట్లు ఎక్స్ ప్రెస్ హరి, నూకరాజు, యాదమ్మ రాజు ఇలా ఎంతో మంది శ్రీముఖితో బాగా క్లోజ్ అయ్యారు.

అలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక శ్రీముఖి క్రేజ్ పూర్తిగా మారిపోయింది. కాస్త నెగెటివిటీ వచ్చినా కూడా శ్రీముఖి ఫాలోయింగ్ బాగానే పెరిగింది. అయితే బుల్లితెరపై మాత్రం షోలు తగ్గిపోయాయి. మళ్లీ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది. అయితే తాజాగా శ్రీముఖి ఏదో ఒక ఈవెంట్, షో కోసం రెడీ అవుతోన్నట్టుంది.

జబర్దస్త్ నరేష్, హరిలను ఆడుకున్న శ్రీముఖి : Sreemukhi

తాజాగా శ్రీముఖి ఓ వీడియోను షేర్ చేసింది. అందులో జబర్దస్త్ నరేష్, ఎక్స్ ప్రెస్ హరి ఇద్దరూ కూడా వెరైటీ వేషం వేశారు. ఇందులో నరేష్.. తబల మీద కూర్చున్నాడు. మాల వేసుకున్న పాత్రలు పోషించినట్టు కనిపిస్తోంది. అలా వారు మేకప్ వేసుకుని రెడీ అయిన తరువాత వీడియోలను షేర్ చేసింది. మరీ ఘోరంగా ఉందక్కా వద్దు అంటూ హరి వేడుకున్నాడు. నరేష్ దారుణంగా ఉన్నాడంటే అంతకంటే ఘోరంగా ఉన్నావ్ అంటూ హరి పరువుతీసింది శ్రీముఖి.

Advertisement