మూడో రోజు గోవాలో ర‌చ్చ.. తిరిగి రావాల‌ని లేదంటూ కామెంట్

బుల్లితెర హాట్ యాంక‌ర్స్‌లో శ్రీముఖి ఒక‌రు. లౌడ్ స్పీక‌ర్‌గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం గోవాలో త‌న ఫ్రెండ్స్‌తో ర‌చ్చ చేస్తుంది. కొద్ది రోజులుగా బిజీ షెడ్యూల్స్‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపిన శ్రీముఖి కొంత రిలాక్సేష‌న్ కోసం త‌న ఫ్రెండ్స్ విష్ణు ప్రియ‌, అరియానా, ఆర్జే చైతూ, సుశృత్‌తో క‌లిసి గోవాకు వెళ్లింది. తొలి రోజు నుండి అక్క‌డి ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ హృద‌యాల‌ను దోచుకుంటుంది.

తొలి రోజు కోల్వా బీచ్ ద‌గ్గ‌ర శ్రీముఖి చేసిన ర‌చ్చ‌కు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేశాయి. రెండో రోజు బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో వావ్ అనిపించింది. ఇక మూడో రోజు ఎద అందాల‌ను చూపిస్తూ కుర్ర‌కారు మ‌న‌సులు గెలుచుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. గోవా వాతావ‌ర‌ణానికి చాలా అల‌వాటు ప‌డ్డ శ్రీముఖి అక్క‌డి తిరిగి రావాల‌ని అనిపించ‌డం లేదు అంటు త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. మ‌రోవైపు శ్రీముఖితో గోవా వెళ్లిన అరియానా, విష్ణు ప్రియ‌లు కూడా త‌మదైన స్టైల్‌లో ఫొటోలు దిగుతూ వాటిని సామాజిక మాధ్య‌మాల‌లో షేర్ చేస్తూ కేక పెట్టిస్తున్నారు. మొత్తానికి ఈ యాంక‌ర్ల గోవా టూర్ పిక్స్ నెటిజ‌న్స్‌కు మంచి మ‌జా అందిస్తున్నాయి.

Advertisement