Sreemukhi: బ్లాక్ డ్రెస్‌లో శ్రీముఖి అందం చూడ‌త‌ర‌మా…!

Sreemukhi: శ్రీముఖి.. ఈ అమ్మ‌డి పేరులోనే వైబ్రేష‌న్ ఉంటుంది. శ్రీముఖి మాట్లాడితే పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోతుంటారు. సోషల్‌ మీడియాలో ఈ అమ్మ‌డి రచ్చ వేరే లెవల్‌లో ఉంటుంది. ఆమె పంచుకునే పిక్స్ సైతం తగ్గేదెలే అనిపిస్తాయి. బుట్టబొమ్మగా కనువిందు చేసే ఈ హాట్‌ యాంకర్ ఇప్పుడు సండే స్పెషల్‌గా అభిమానులకు హాట్‌ ట్రీట్‌నిచ్చింది.

sreemukhi stunning look3
sreemukhi stunning look3

శ్రీముఖి తాజాగా తన గ్లామర్‌ ఫోటోలతో సోషల్ మీడియాలో ఫైర్‌ అంటిచ్చింది. బ్లాక్‌ డ్రెస్‌లో పిచ్చెక్కించే అందాలతో మంట పెడుతుంది. ఆదివారం వేళ అభిమానులు అదిరిపోయే ట్రీట్‌నిచ్చింది శ్రీముఖి. లేటెస్ట్ గా శ్రీముఖి పంచుకున్న హాట్‌ ఫోటో షూట్‌ పిక్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతున్నాయి.

sreemukhi stunning look2
sreemukhi stunning look2

శ్రీముఖి భారీ అందాలపై సెటైర్లతోపాటు ఆమె బిగువైన అందాలపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. అందాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారు. నువ్వు బ్లాక్‌ డ్రెస్‌ వేస్తే సోషల్‌ మీడియా షేక్‌ అయిపోవాల్సిందే అంటూ కవితలు రాసుకుంటున్నారు. మొత్తంగా శ్రీముఖి అందాలకు మైమరిచిపోతున్నారు.

sreemukhi stunning look1
sreemukhi stunning look1

శ్రీముఖి కొంత గ్యాప్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. వరుసగా షోలను చేస్తూ దూసుకుపోతుంది. `బొమ్మ అదిరింది` షో తర్వాత గ్యాప్‌ వచ్చిన శ్రీముఖి చాలా రోజులు ఖాళీగానే ఉంది. అడపాదడపా స్పెషల్‌ ఈవెంట్లకి యాంకర్‌గా చేయడం తప్ప పెద్దగా షోలు లేవు. కరోనా ఎఫెక్ట్ ఈ రాములమ్మపై గట్టిగానే పడిందని చెప్పొచ్చు.

sreemukhi stunning look
sreemukhi stunning look

ఇప్పుడు స్టార్ మాలో వచ్చే `కామెడీస్టార్స్` కి యాంకర్‌గా చేస్తుంది. అంతకు ముందు వర్షిణి సౌందరాజన్‌ ఈషోని యాంకర్‌గా చేసేది. పొట్టి దుస్తుల్లో ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అయినా ఆమెని పక్కన పెట్టి మరీ శ్రీముఖిని ఎంపిక చేశారు. చలాకీగా, చురుకుగా, చిలిపిగా ఉంటూ షోని రక్తికట్టించడంలో భాగమవుతుంది శ్రీముఖి. అలా కామెడీ షోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారిపోయిందీ బుట్టబొమ్మ.