SREEMUKHI: శ్రీముఖికి పెళ్లి ప్ర‌పోజ‌ల్.. హాట్ బ్యూటీ ఏం డిసైడ్ చేసింది..!

బుల్లితెర‌పై ర‌చ్చ చేసే హాట్ యాంక‌ర్ శ్రీముఖి బిగ్ బాస్ షోతో మ‌రింత పాపుల‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. తన అందంతో.. మాటలతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. పటాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి ఆ త‌ర్వాత రెగ్యుల‌ర్‌గా ప‌లు టీవీ షోస్ చేస్తూ ఆడియ‌న్స్‌ని అల‌రిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఫోటో షూట్లతో రచ్చ రచ్చ చేస్తుంది. ఇక వీలు కుద‌రిన‌ప్పుడ‌ల్లా బుల్లితెర స్టార్‌ యాంకర్‌ శ్రీముఖి అభిమానులతో ముచ్చటిస్తుంటుంది.

Sreemukhi Ugadi Special Photos
 

తాజాగా శ్రీముఖి నెటిజ‌న్స్‌తో ముచ్చ‌టించ‌గా ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు రాములమ్మ తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చింది. ఓ నెటిజన్‌ ధైర్యం చేసి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడ‌గ‌డంతో అవాక్కైన శ్రీముఖి ‘వద్దురా, సోదరా, పెళ్లంటే నూరేళ్ల మంటరా..’ పాటను గుర్తు చేస్తూ కుదరదని తేల్చి చెప్పింది. పోనీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావ్‌ అన్న మరొకరి ప్రశ్నకు దానికి సమాధానం తన దగ్గర లేదని బదులిచ్చింది. ఎప్పటిలాగే తిరిగి యూట్యూబ్‌ వీడియోలతో మమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయండన్న అభిమానుల కోరికకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

మీమర్స్‌ అంటే ఎంతో ఇష్టమన్న శ్రీముఖి ఒకవేళ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం విధిస్తే మీమ్స్‌ మిస్‌ అవుతానని బాధపడింది. మ‌రో నెటిజ‌న్ మీరు బిగ్ బాస్ లో లేక‌పోతే ఎంట‌ర్‌టైన్మెంట్ మిస్ అవుతున్నామ‌ని అన‌డంతో దానికి మంచిది అంటూ స‌మాధానం ఇచ్చింది శ్రీముఖి. ఇక తనకు బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ అంటే క్రష్‌ అని చెప్పింది. అలానే త‌ను ప్రేమ‌లో లేద‌ని చెప్పిన శ్రీముఖి న‌న్ను న‌మ్మండంటూ నెటిజ‌న్స్‌ని కోరింది. ఇక చాలామంది శ్రీముఖి తమ్ముడు సుష్రుత్‌ గురించి అడిగారు. అతడంటే చాలా ఇష్టమని పేర్కొంది.