Sreemukhi : అవకాశం ఇస్తా పక్కలోకి వస్తావా అన్నాడు.. శ్రీముఖి షాకింగ్ కామెంట్స్
NQ Staff - October 29, 2022 / 11:03 AM IST

Sreemukhi : సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే ఒకప్పుడు ఎన్నో అడ్డంకులు అవరోధాలు ఉండేవి. ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల అవి కాస్త తగ్గాయని చెప్పాలి. గతంలో అవకాశాలు ఇస్తాం అంటూ మోసాలు చేసిన వారు మోసపోయిన వారు చాలా మంది ఉన్నారు.
ముఖ్యంగా నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని ప్రయత్నించే అమ్మాయిలను వల వేసి పట్టి మోసం చేసిన ప్రొడక్షన్ మేనేజర్ ఇంకా ఎంతో మంది ఉన్నారు. తాజాగా బుల్లి తెర రాములమ్మగా మంచి పేరు దక్కించుకున్న శ్రీముఖి మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్…
తాను కెరియర్ ఆరంభంలో ఛాన్స్ ల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఒక దర్శకుడు తనకి పడక సుఖం ఇస్తే చాన్స్ ఇస్తాను అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడట. ఆ వ్యాఖ్యలతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైందట.
పక్కలోకి వస్తేనే ఛాన్స్ ఇస్తానంటూ అతడు చెప్పడంతో బుల్లి తెరపై మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ఆమె సన్నిహితులు అంటున్నారు. బుల్లి తెరపై సూపర్ స్టార్ గా దూసుకు పోతున్న శ్రీముఖి పట్ల అలాంటి వ్యాఖ్యలు చేసిన ఆ దుర్మార్గపు దర్శకుడు ఎవడై ఉంటారు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
తెలుగు హీరోయిన్స్ స్థాయి లో శ్రీముఖి గుర్తింపు దక్కించుకుంది. ప్రతిభ ఉంటే ఆత్మాభిమానం చంపుకోవాల్సిన అవసరం లేదని శ్రీముఖి నిరూపించింది. కొత్తగా వచ్చే అమ్మాయిలు శ్రీముఖిని ఆదర్శంగా తీసుకుని కష్టపడితే మంచి ఫలితం సాధిస్తారు.