Sreemukhi: క‌ల్లు తాగిన శ్రీముఖి.. ఒక్క సిప్‌కే వాంతి..!

Sreemukhi: బుల్లితెర, వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు శ్రీముఖి. బిగ్ బాస్ షో తరువాత శ్రీముఖి కెరీర్ పూర్తిగా మారిపోయింది. వ‌రుస ఆఫ‌ర్స్ ద‌క్కించుకొని బిజీబిజీగా ఉన్న శ్రీముఖి ఇప్పుడు పెద్ద‌గా షోలు చేస్తున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. కాక‌పోతే సోష‌ల్ మీడియా ద్వారా ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది.

Sreemukhi

పటాస్ షోతో శ్రీముఖి రాములమ్మగా అందరినీ ఆకట్టుకున్నారు. మ‌ళ్లీ అలాంటి షో శ్రీముఖికి ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా ప‌డ‌డం లేదు. అన్నిఛానెల్స్ క‌వ‌ర్ చేస్తున్న‌ప్ప‌టికీ శ్రీముఖి మాత్రం పెద్ద‌గా స‌క్సెస్ కాలేకపోతుంది. అయితే త‌న క్రేజ్ త‌గ్గకుండా ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంటుంది.

కెరీర్ మొదట్లో అదుర్స్, సూపర్ సింగర్ 9 షోలలో యాంకరింగ్ చేసి.. వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంది. పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ తర్వాత యాంకర్ రవితో కలిసి పటాస్ షో లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. సినీ అవార్డు ఫంక్షన్ లలో కూడా హోస్టింగ్ చేస్తుంది శ్రీముఖి. అయితే సోష‌ల్ మీడియా ద్వారా ఈ అమ్మ‌డికి విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డుతుంది.

ఫ్రెండ్స్ తో కలిసి తెగ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉండ‌డం, అక్క‌డ వీరు చేసే ర‌చ్చ‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వంటివి షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ‌.శ్రీముఖి హాట్ ఫొటోలు అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటాయి. అయితే ఈమధ్య ఏలియన్ ఫిల్టర్ లతో కామెడీ వీడియోలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ వీడియో షేర్ చేసుకుంది.

షార్ట్ బ్రేక్‌లో ఓవ‌ర్ యాక్ష‌న్ అంటూ శ్రీముఖి షేర్ చేసిన వీడియోలో ఏలియన్ గెట‌ప్‌లో ఉన్న శ్రీముఖి నేను దుర్గం ప‌ల్లికి వ‌చ్చాను. ఇక్క‌డ ఈత క‌ల్లు చాలా బాగుంది.కొంచెం టేస్ట్ చేద్దామ‌ని తాగుతున్నాను అని ఓ సిప్ చేసింది. ఇక ఈ అమ్మ‌డు వాంతి చేసుకున్నట్టు ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చింది. ఈ వీడియోలో శ్రీముఖి నిజంగానే ఓవ‌ర్ చేసిందంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు.