SreeMukhi: లంగా ఓణీలో ముద్దుగుమ్మ ఎంత అందంగా ఉంది..!

SreeMukhi: తెలుగులో హాట్ యాంక‌ర్‌గా అద‌ర‌గొడుతున్న అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి. ఈ అమ్మ‌డు ఒక‌వైపు బుల్లితెర షోస్ చేస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని టైటిల్ కోసం గట్టిగా పోటీపడ్డారు అమ్మడు. సింపథీ వర్కవుట్ కావడంతో శ్రీముఖికి షాక్ ఇస్తూ బిగ్ బాస్ టైటిల్ రాహుల్ సిప్లిగంజ్ పట్టుకుపోయారు. టైటిల్ మిస్ అయినా రెమ్యూనరేషన్ భారీగా రాబట్టారని అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి.

SreeMukhi Latest Beautiful Photos
SreeMukhi Latest Beautiful Photos

శ్రీముఖి చూపులు, కుర్రకారు మనసులకు గాలం వేస్తున్నాయి. సౌందర్య ఆరాధకులు శ్రీముఖి అందాలు ఆస్వాదిస్తూ సేద తీరుతూ ఉంటారు. మిగతా యాంకర్స్ తో పోల్చితే చాలా తక్కువ కాలంలో శ్రీముఖి స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. సోలో హీరోయిన్ ఆఫర్స్ కూడా పట్టేస్తున్న శ్రీముఖి క్రేజీ అంకుల్స్ మూవీలో హీరోయిన్ గా చేశారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా క్రేజీ అంకుల్ తెరకెక్కింది. మరోవైపు బిజినెస్ ఉమెన్ గా కొన్ని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు శ్రీముఖి.

SreeMukhi Latest Beautiful Photos
SreeMukhi Latest Beautiful Photos

లువా బ్రాండ్ పేరుతో ఫ్యాషన్ స్టోర్స్ చైన్ ప్రారంభించడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా కూడా తన పాపులారిటీ మరింత పెంచుకుంటున్నారు శ్రీముఖి. రెగ్యులర్ గా ఫోటో షూట్స్ చేస్తూ.. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవ‌ల నితిన్ హీరోగా వ‌చ్చిన‌ మ్యాస్ట్రో చిత్రంలో శ్రీముఖి విలన్ భార్య పాత్ర చేయడం విశేషం. పోలీసు భార్యగా శ్రీముఖి ఆకట్టుకుంది. అటు నటిగా, ఇటు యాంకర్ గా, బిజినెస్ ఉమన్ గా పలు రంగాలలో రాణిస్తుంది.

SreeMukhi Latest Beautiful Photos
SreeMukhi Latest Beautiful Photos

ఇదిలా ఉంటే శ్రీముఖి ఇటీవ‌ల ఫోర్డ్ కారు కొనుగోలు చేసింది. ఫోర్డ్ సంస్థ తన వ్యాపార కార్యక్రమాలను ఇండియాలో నిలిపివేస్తున్నట్టు ప్రకటన చేయడంతో.. ఆ కంపెనీ కారు ఎందుకు కొన్నావంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే సర్వీస్ సెంటర్లు పదేళ్ల వరకూ ఉంటాయని నెటిజన్లు స్పందనలు తెలియజేస్తున్నారు శ్రీముఖి 2019 మార్చిలో ఖరీదైన బెంజ్ కారుని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

SreeMukhi Latest Beautiful Photos
SreeMukhi Latest Beautiful Photos