Sreemukhi: శేఖ‌ర్ మాస్ట‌ర్‌పై ముద్దుల వర్షం కురిపించిన శ్రీముఖి

Sreemukhi: బుల్లి తెర యాంకర్లు, యాక్టర్లు ప్రస్తుతం అభిమానుల్ని తెగ ఎంటర్ టైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఈ ప్రయత్నంలో వాళ్ళు శృతి మించుతున్నారనే విషయం కూడా తెలుస్తుంది. టాప్ ఛానెల్స్ లో ప్రసారమయ్యే కొన్ని ప్రోగ్రామ్స్ లో యాంకర్లు వారి హద్దును మించి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారనే విషయం అర్థమవుతుంది. నెక్ట్స్ శనీ,ఆదివారాల్లో ప్రసారమయ్యే సిక్త్ సెన్స్ ప్రొగ్రామ్ లో గెస్టులుగా శ్రీముఖి, శేఖర్ మాస్టర్లు వచ్చారు.

Sreemukhi Kisses Sekhar Master
Sreemukhi Kisses Sekhar Master

ఈ ప్రోగ్రామ్ కి యాంకర్ గా ఓంకార్ వ్యవహరిస్తున్నారు. ప్రతి వారం తన ప్రోగ్రామ్ కు బుల్లితెర ఆర్టిస్టులను, యాంకర్లను పిలిచి ఇంట్రెస్టింగ్ గా గేమ్ ను ఆడిస్తుంటారు. దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు ఛానెల్ వాళ్ళు. ఈ ప్రోమోలో యాంకర్ శ్రీముఖి, డాన్స్ మాస్టర్ శేఖర్ లు తమ అల్లరితో ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్నారు.

అయితే ఈ వీడియోలో యాంకర్ శ్రీముఖి, శేఖర్ మాస్టర్ కు తెగ ముద్దులు కురిపిస్తుంది. లాస్ట్ లో శేఖర్ మాస్టర్ వైఫ్ శిరీష గారు.. ఇవన్నీ కేవలం కల్పితాలనీ, షో కోసం ఇలా చేశామని శ్రీముఖి తెలిపింది. ఇంతలో శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ, శ్రీముఖి, తనకు ముద్దులు పెట్టలేదని, అవన్నీ గ్రాఫిక్స్ లో క్రియేట్ చేశారని ఫన్నీగా చెబుతున్నారు.

ఇక వీరిద్దరి డాన్స్ తో యూత్ కి క్రేజ్ పుట్టిస్తున్నారు. శ్రీముఖి తన డాన్స్ తో అందర్ని ఆశ్చర్యపరుస్తుంది. యాంకర్ ఓంకార్, శేఖర్ మాస్టర్ ను తనకు పిల్లలు పుట్టినప్పుడు మీ ఫీలింగ్ ఏంటని అడగ్గా.. తను షూటింగ్ లో ఉండగా పాప పుట్టిందని ఫోన్ వచ్చిందని ఆ టైమ్ లో చాలా ఆనందం అనిపించిందని..

నిజానికి తనకు పాప పుట్టాలని అనుకున్నానని.. ఎందుకంటే తనకు ముగ్గురు అన్నదమ్ములు అవ్వడంతో ఆడపిల్లలంటే ఇష్టం అని.. ఆ టైమ్ లో భావోద్వేగానికి లోనయ్యానని ఎమోషనల్ అయ్యారు శేఖర్ మాస్టర్. ఇక శ్రీముఖి తన స్టైల్ లో అల్లరి చేసి ప్రోమోలో ఎంటర్ టైన్ చేసింది.