Anchor Sreemukhi: శ్రీముఖికి నాలుగు పేజీల లేఖ రాసిన అభిమాని.. ఫుల్ ఖుష్ అయిన రాములమ్మ

Anchor Sreemukhi: అందానికే అసూయ పుట్టించేలా క‌నిపిస్తుంటుంది శ్రీముఖి.బుల్లితెరపై సూపర్ యాక్టివ్ యాంకర్ గా రాణిస్తోంది. బుల్లితెరపై శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు రీసెంట్ గా క్రేజీ అంకుల్స్ అనే చిత్రంలో కూడా నటించింది. ఈ మూవీలో శ్రీముఖి, సింగర్ మనో, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటించారు. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది.

శ్రీముఖి బిగ్ బాస్ తో తన పాపులారిటీ పెంచుకుంది. అభిమానులు శ్రీముఖిని ముద్దుగా రాములమ్మ అని పిలుచుకుంటారు. కామెడీ స్టార్స్ షో కోసం శ్రీముఖి వయ్యారంగా ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతుంటాయి. బుల్లితెరపై శ్రీముఖికి ఇంత క్రేజ్ రావడానికి కారణం ఆమె అందం మాత్రమే కాదు చలాకీతనం కూడా. శ్రీముఖి తరచుగా ఫోటోషూట్ చేస్తూ గ్లామర్ గా కనిపిస్తూ ఉంటుంది.

శ్రీముఖికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిమానానికి హద్దులు ఉండవు అంటారు. సెలెబ్రిటీలను ఆరాధించే ఫ్యాన్స్ చేసే చర్యలు ఒక్కోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతూ ఉంటాయి. అలాంటి సంఘటనే శ్రీముఖి అభిమాని చేశారు. శ్రీముఖికి ఏకంగా నాలుగు పేజీల లెటర్ పోస్ట్ లో పంపారు. ఆమె యాంకరింగ్ టాలెంట్ ని ఆకాశానికి ఎత్తారు. ఈవెంట్ ఏదైనా మీరు ఉంటే అభిమానులు వెర్రెత్తిపోతారు అని చెప్పుకొచ్చాడు.

సుదీర్ఘమైన లేఖలో శ్రీముఖి కెరీర్ లోని ముఖ్యమైన మలుపులను, ఘట్టాలను ప్రస్తావించాడు. గ్లామర్ ఫీల్డ్ లో శ్రీముఖి మరిన్ని శిఖరాలు అధిరోహించాలి, ఉన్నత స్థాయికి చేరుకోవాలని లేఖ ముగించాడు. సోషల్ మీడియా యుగంలో అచ్చతెలుగులో నాలుగు పేజీల లేఖ చదువుతుంటే ఎంతో ఆనందం వేసింది. మీరు ఎవరో కానీ ధన్యవాదాలు అంటూ శ్రీముఖి కృతజ్ఞత చాటుకున్నారు.

ప్రస్తుతం ఈ లెటర్ వైరల్ గా మారింది. యాంకర్ శ్రీముఖికి కూడా డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారని, ఆమెను అనుక్షణం ఫాలో అవుతున్నారని తాజా సంఘటన ద్వారా అర్థం అయ్యింది. మరోవైపు నటిగా , యాంకర్ గా శ్రీముఖి దూసుకుపోతున్నారు. ఇటీవల ఓటిటి లో విడుదలైన మ్యాస్ట్రో చిత్రంలో విలన్ వైఫ్ పాత్ర చేశారు శ్రీముఖి.