Sreemukhi: శ్రీముఖి ఇంట విషాదం.. ఎమోష‌న‌ల్ అయిన యాంక‌ర‌మ్మ‌

Sreemukhi: త‌న మాట‌ల‌తో పాటు అంద‌చందాల‌తో యువ‌త‌ని ఆక‌ర్షించే అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి. ప‌టాస్ షోతో పాపులారిటీ తెచ్చుకున్న శ్రీముఖి సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంటుంది. రీసెంట్‌గా ఈ అమ్మ‌డు త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఎమోష‌న‌ల్ అయింది. సోమ‌వారం త‌న అమ్మ‌మ్మ మ‌ర‌ణించ‌గా, ఆమె ఫొటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. మిస్ యూ అని తెలిపింది.

Sreemukhi Emotional About Her Grand Mother is Died
Sreemukhi Emotional About Her Grand Mother is Died

అమ్మ‌మ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెతో చాలా విష‌యాలు పంచుకునేదాన్ని. అమ్మమ్మ ఎప్పుడూ హుషారుగా ఉండేది అంటూ తెలిపింది. అంతేకాకుండా ఆమె చాలా ధైర్యవంతురాలు అంటూ.. అందరికీ సంతోషాన్ని పంచేదని తెలిపింది. నువ్వు ఎప్ప‌టికీ మా హృద‌యాల‌లో నిలిచి ఉంటావు. జీవితంలో నువ్వు ఇచ్చిన ప్ర‌తి దానికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అంటూ శ్రీముఖి త‌న అమ్మ‌మ్మ‌కి నివాళులు అర్పించింది.

శ్రీముఖి యాంక‌ర్‌గాన కాకుండా న‌టిగాను ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంది. తనదైన మాట తీరుతో ప్రేక్షకులను కట్టుకోవడంలో శ్రీముఖి దిట్ట.. పలు టీవీషోలతో అలరిస్తూనే సినిమాల్లోనూ చేస్తుంది ఈ బబ్లీ బ్యూటీ. రీసెంట్‌గా క్రేజీ అంకుల్స్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని పల‌క‌రించిన ఈ ముద్దుగుమ్మ పెద్ద స‌క్సెస్ అయితే అందుకోలేక‌పోయింది.

ఇటీవ‌ల శ్రీముఖి త‌న పెళ్లిపై ఓపెన్ అయింది 31 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా.. ఎందుకంటే 3+1=4.. నా లక్కీ నంబర్ నాలుగు అందుకే 31 ఏళ్లకి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా.. నాకు 31 ఏళ్లు వచ్చేసరికి నాకు మంచి సెన్సిబుల్ పర్సన్ దొరుకుతాడనే నమ్మకం, ఆశ ఉంది. అందుకే వెయిట్ చేస్తున్నా’ అంటూ క్లారిటీ ఇచ్చింది శ్రీముఖి.