బుల్లితెర స్టార్ యాంకర్స్‌లో ఒకరైన శ్రీముఖి చలాకీ మాటలతో పాటు అందచందాలతోను ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు తన యాంకరింగ్‌తో అదరగొడుతున్న సమయంలో బిగ్ బాస్ ఆఫర్ దక్కడంతో శ్రీముఖి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వంద రోజులకు పైగా బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న శ్రీ మాటలతో పాటు ఆట పాటలతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది. అంతేకాదు ఒకానొక సందర్భంలో తన బ్రేకప్ స్టోరీ కూడా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

శ్రీముఖి బ్రేకప్ స్టోరీ అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమెకు హ్యాండ్ ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరంటూ కొద్ది రోజుల పాటు చర్చ జరిగింది. అయితే అందరు శ్రీముఖి బిగ్ బాస్ విన్నర్ అవుతుందని అనుకోగా, రాహుల్ సిప్లిగంజ్ ట్రోఫీ అందుకోని శ్రీముఖితో పాటు ఆమె అభిమానులకు పెద్ద షాకిచ్చాడు. బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చాక శ్రీముఖి పలు షోస్‌తో పాటు సినిమాలు కూడా చేస్తుంది. ప్రస్తుతం మనీ ఫేం డైరెక్టర్ శివనాగేశ్వర్ డైరెక్షన్ లో క్రేజీ అంకుల్స్ చిత్రంలో నటిస్తోంది.సీనియర్ గాయకుడు మనో ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడట. మనో ఈ ప్రాజెక్టులో శ్రీముఖి అంకుల్ పాత్రలో కనిపిస్తాడని టాక్.
కొద్ది రోజుల క్రితం తన ఇంటి గృహ ప్రవేశానికి సంబంధించిన ఫొటోలతో రచ్చ చేసిన శ్రీముఖి తాజాగా తన సోదరుడు సుశృత్ 26వ బర్త్ డే వేడుక ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలో శ్రీముఖి వివిధ రకాలుగా హావభావాలు ప్రదర్శిస్తూ నెటిజన్స్‌ని థ్రిల్ చేస్తుంది. కరోనా వలన ఎవరిని ఈ బర్త్‌డే వేడుకకు ఆహ్వానించలేదని తెలుస్తుంది.