Srimukhi-Avinash kisses : లైవ్ లో ముద్దు పెట్టుకోబోయిన శ్రీముఖి-అవినాష్.. హవ్వ ఏంటీ పనులు..!
NQ Staff - July 21, 2023 / 01:29 PM IST

Srimukhi-Avinash kisses : యాంకర్ గా శ్రీముఖికి మంచి క్రేజ్ ఉంది. ఆమె చేస్తున్న షోలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంటాయి. ఆమె మొదటి నుంచి చాలా కష్టపడుతూనే ఈ స్థాయికి వస్తోంది. అయితే ఈ నడుమ ఆమె చేస్తున్న పనులు తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి. తాజాగా ఆమె స్టార్ మాలో వచ్చే స్టార్ మా పరివారం షోకు హోస్ట్ గా చేసింది.
ఇందులో స్టార్ మా ఛానెల్ లో వచ్చే సీరియల్ యాక్టర్స్ వచ్చారు. ప్రోమో ఆసక్తికరంగా ఉండడంతో పాటు మరోసారి శ్రీముఖి వార్తల్లో నిలిచేలా చేసింది. ఇందులో ముక్కు అవినాష్ కూడా సందడి చేశాడు. ఫైమా, హరి పంచ్ లతో అలరించారు. ఇక ఈ షోలో సీరియల్ ఆర్టిస్టులు అందరూ రకరకాల టాస్క్ లతో అలరించారు.
నా దగ్గరకు ముద్దు పెట్టు..
మధ్యమధ్యలో ముద్దులతో రచ్చ రంబోలా చేశారు. కాగా ఇందులో శ్రీముఖి కమెడియన్ ముక్కు అవినాష్ చెంప చెల్లమనిపించింది. ఎందుకంటే.. శ్రీముఖి ఓ డైలాగ్ చెబుతూ.. నా దగ్గరకు వచ్చి ఒకసారి ముద్దు పెట్టు అంటూ అవినాష్ కాలర్ పట్టుకుని దగ్గరకు లాక్కుంటుంది.
దాంతో అవినాష్ వెళ్లి ముద్దు పెట్టబోతుంటాడు. క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్ అయిపోయి నిజంగానే శ్రీముఖిని ముద్దుపెట్టుకోవడానికి ట్రై చేశాడు అవినాష్. వెంటనే శ్రీముఖి అతన్ని చెంప మీద కొట్టింది. దీంతో అందరూ షాక్ అయిపోయారు. తర్వాత అందరూ తేరుకుని నవ్వుతూ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది.