Sreemukhi: బుల్లితెరపై యాంకర్ రవి చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆయన వలన కో యాంకర్స్ చాలా మంది పేరు ప్రఖ్యాతలు పొందారు. అందులో లాస్య, శ్రీముఖితో పాటు పలువురు భామలు ఉన్నారు. అయితే కొద్ది రోజుల తర్వాత రవితో వారికి విభేదాలు వచ్చిన కారణంగా ఆయనతో యాంకరింగ్ చేసేందుకు ఆసక్తి చూపలేదు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత లాస్య ..రవితో కలిసి మళ్లీ యాంకరిగ్ చేయడం మొదలు పెట్టింది.


ఇక పటాస్’ షో ద్వారా సూపర్ క్రేజ్ కొట్టేశారు శ్రీముఖి, రవి. ఈ షో వేదికపై ఆ ఇద్దరి చలాకీతనం, కెమిస్ట్రీ, పంచ్ టైమింగ్స్ చూస్తూ బుల్లితెర ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అలా మొదలైన వీరి ప్రయాణం ఆ తర్వాత పలు ఈవెంట్లలో కూడా జోడీ కట్టి అందరినీ ఆకట్టుకుంది. బేసికల్గా యాంకర్స్ అన్నాక.. ఆడియన్స్కి ఏ మాత్రం బోర్ కొట్టించకుండా చూసుకోవాలి.
ఆ పనిని సమర్థవంతంగా చేస్తుంటారు శ్రీముఖి-రవి జోడీ. యాంకరింగ్ చేస్తున్నపుడు అన్నీ మరచిపోయి అత్యంత సన్నిహితంగా ఉంటూ అలరిస్తుంటారు.అది చూసి ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందనే వార్తలు పుట్టుకొచ్చాయి. వాళ్ళిద్దరికీ ప్రైవేట్ రిలేషన్ ఉంది కాబట్టే అంత సన్నిహితంగా ఉంటున్నారని టాక్ నడిచింది.
ఆ తర్వాత కొంతకాలానికి ఏమైందేమో కానీ వీరిద్దరి జోడీ మళ్లీ ఎక్కడా కనిపించలేదు. దీంతో విబేధాల కారణంగానే వీరు కలిసి యాంకరింగ్ చేయడం లేదనే వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై ఇంతవరకు ఈ జోడీ స్పందించలేదు. అయితే తాజాగా దాదాపు రెండేళ్ల అనంతరం వీరిద్దరు మళ్లీ కలిసినట్లు తెలుస్తుంది.

బిగ్బాస్ మహోత్సవం అనే ఓ షో కోసం వీరిద్దరు కలిసి యాంకరింగ్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో ఈ విషయం బయటపడింది. దీంతో రవి-శ్రీముఖి మళ్లీ కలిసిపోయారంటూ ప్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.