SREEKARAM: థియేట‌ర్‌లో ఫ‌ట్‌.. ఓటీటీలో మాత్రం హిట్

SREEKARAM ఇటీవ‌ల థియేట‌ర్‌లో విడుద‌లైన వైల్డ్ డాగ్, చావు క‌బ‌రు చ‌ల్ల‌గా, శ్రీకారం చిత్రాలు థియేట‌ర్‌లో పెద్ద‌గా ఆద‌ర‌ణ రాబ‌ట్ట‌క‌పోయిన ఓటీటీలో మాత్రం దుమ్ము రేపుతున్నాయి. శ‌ర్వానంద్, ప్రియా అరుళ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో బి. కిషోర్ రెడ్డి తెర‌కెక్కించిన సందేశాత్మ‌క చిత్రం శ్రీకారం మార్చి 11న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. స్ఫూర్తిదాయకమైన అంశాలతో నూతన వ్యవసాయ విధానానికి ఎలా శ్రీకారం చుట్టాలో ద‌ర్శ‌కుడు అద్భుతంగా చూపించాడు. శ్రీకారం మూవీకి థియేట‌ర్‌లో ఆద‌ర‌ణ అంత‌గా ల‌భించ‌లేదు.

రీసెంట్‌గా శ్రీకారం చిత్రాన్ని స్ట్రీమింగ్ యాప్ సన్ నెక్స్ట్ లో డిజిటల్ ప్రీమియర్ గా విడుద‌ల చేశారు. అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఈ సినిమా మిలియన్స్ కొద్దీ వ్యూస్ రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తుంది. థియేట‌ర్‌లో పెద్ద‌గా ఆద‌ర‌ణ పొందక పోయిన‌, ఓటీటీలో మాత్రం దుమ్ము రేపుతుందని స‌మాచారం. ‘శ్రీకారం’ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట – గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చగా.. జె యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించారు. రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాసారు. సీనియర్ నరేష్, సాయికుమార్,మురళీ శర్మ, రావు రమేష్, ఆమని , సత్య,సప్తగిరి తదితరులు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టించారు.

Advertisement