Sree Leela Successive Offers In Tollywood : చిన్న హీరోల నుండి సూపర్‌ స్టార్స్ వరకు అందరికీ ఆమె కావాలి

NQ Staff - July 7, 2023 / 07:15 PM IST

Sree Leela Successive Offers In Tollywood : చిన్న హీరోల నుండి సూపర్‌ స్టార్స్ వరకు అందరికీ ఆమె కావాలి

Sree Leela Successive Offers In Tollywood :

టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రీ లీల. ఈ అమ్మడు మొదటి సినిమా పెళ్లి సందడితో ఫెయిల్యూర్ చవి చూసింది. ఆ తర్వాత సినిమా కూడా పెద్దగా ఆడలేదు. అయినా కూడా ఈ అమ్మడికి వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి.

రవితేజతో నటించిన ధమాకా సినిమా ఒక్కటి ఈమెకి సక్సెస్ ని తెచ్చి పెట్టింది. ఆ తర్వాత సినిమాలన్నీ కూడా పెద్దగా ఆడిందే లేదు. అయినా కూడా ప్రస్తుతం ఈమె చేతిలో దాదాపు అర డజన్ సినిమాలు ఉన్నాయి అనే విషయం తెలిసిందే.

ఒకవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ మరో వైపు కొత్త హీరోయిన్ వైష్ణవ తేజ్ సినిమాలో నటిస్తోంది. ఇలా స్టార్ హీరోలకు చిన్న హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా నిలిచిన శ్రీ లీల ముందు ముందు పూర్తిగా స్టార్ హీరోల మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఎన్టీఆర్.. రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలకు ఈ ముద్దుగుమ్మ జోడిగా నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాల్లో కనీసం రెండు మూడు సినిమాలు అయినా సక్సెస్ అయితే కచ్చితంగా భారీ సినిమాల్లో నటించే అవకాశాలు వస్తాయి అన్నట్లుగా కొందరు మాట్లాడుకుంటున్నారు.

మొత్తానికి ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ అనుకోవాలి. మొదటి సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా కూడా ఈ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకోవడం కేవలం ఈమెకు మాత్రమే సాధ్యం అయింది అంటూ మీడియా వర్గాల వారు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us