Sree Leela : ‘ధమాకా’కి రెట్టింపు.. శ్రీలీల జోరు మామూలుగా లేదుగా..!
NQ Staff - June 19, 2023 / 05:55 PM IST

Sree Leela : పెళ్లి సందడి సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల. తెలుగు లో ఈమె మొదటి సినిమాతోనే నిరాశ పర్చడంతో హీరోయిన్ గా కొనసాగడం కష్టమే అన్నట్లుగా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ అదృష్టం కలిసి వచ్చి ఈ అమ్మడి యొక్క జోరు ఓ రేంజ్ లో పెరిగింది.
సక్సెస్ లు లేకున్నా కూడా స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశాలు దక్కించుకుంది. ముఖ్యంగా ధమాకా సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న శ్రీలీల అప్పటి నుండి కంటిన్యూస్ గా సినిమాలను కమిట్ అవుతూనే ఉంది. ఈ ఏడాది శ్రీలీల నటించిన నాలుగు అయిదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఏకంగా పది సినిమాలు ఉన్నాయి.. ఇంకా కూడా కొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఈ రేంజ్ లో ప్రస్తుతం సౌత్ హీరోయిన్స్ లో ఏ ఒక్కరు కూడా నటించడం లేదు.. అన్ని సినిమాలకు కమిట్ అవ్వలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా రవితేజ హీరోగా నటిస్తున్న ఒక సినిమా లో శ్రీలీల నటించేందుకు ఎంపిక అయ్యింది. ధమాకా సినిమాకి నామమాత్రపు రెమ్యూనరేషన్ ను శ్రీలీల తీసుకుంది.
ఏడాదిలోపే మరో సినిమాను రవితేజ తో నటించేందుకు సిద్ధం అవుతున్న శ్రీలీల ఈసారి పారితోషకం విషయంలో అందరికి షాక్ ఇచ్చి రెట్టింపు కంటే కూడా అధనంగా రవితేజ సినిమాకు తీసుకుంటుంది. ధమాకా సినిమాకి తీసుకున్న పారితోషికంతో పోల్చితే ప్రస్తుతం తీసుకోబోతున్న పారితోషికం రెట్టింపు అంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు.