pushpa: పుష్ప చిత్రంలో మాస్ మ‌సాలా సాంగ్.. అదిరిపోయే బీట్ రెడీ చేస్తున్న దేవి శ్రీ

ప్ర‌స్తుతం సినీ ఇండ‌స్ట్రీలో తెర‌కెక్కుతున్న క్రేజియెస్ట్ చిత్రాల‌లో పుష్ప ఒక‌టి. అల్లు అర్జున్, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుంది. తొలి భాగాన్ని ఈ ఏడాది విడుద‌ల చేయ‌నుండ‌గా, రెండో భాగాన్ని వ‌చ్చే ఏడాది విడుద‌ల చేస్తార‌ట‌. అయితే ఈ సినిమాకు సంబంధించి వ‌స్తున్న వార్త‌లు ఫ్యాన్స్ ఆనందాన్ని అవ‌ధులు దాటిస్తున్నాయి.తాజాగా ఈ సినిమాలో మాస్ సాంగ్ కోసం దేవి శ్రీ ప్ర‌సాద్ ప్ర‌త్యేక క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ట‌. మాస్ ప్రేక్ష‌కుల‌ని ఓ రేంజ్‌లో అల‌రించేలా బీట్స్‌ని రెడీ చేస్తున్నార‌ట‌. ఈ మాస్ సాంగ్ కోసం బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకున్నారు.

‘అల వైకుంఠపురములో’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ చేస్తున్న పుష్ప సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయ‌.బ‌న్నీ బర్త్ డే సంద‌ర్భంగా విడుద‌లైన 1.21 నిమిషాల నిడివితో విడుదలైన ఈ టీజర్‌‌ని బట్టి ‘పుష్ప’ సినిమా ఏ రేంజ్‌ సినిమానో హింట్ ఇచ్చాడు దర్శకుడు సుకుమార్. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్.. అల్లు అర్జున్ లుక్ ఇదో సరికొత్త ఫార్మేట్ చిత్రం అని చెప్పకనే చెబుతుంది. చిత్తూరు యాసలో ‘తగ్గేదే..లే’ అంటూ వేట కొడవలితో ఊర మాస్ గెటప్‌లో అల్లు అర్జున్ చెప్తున్న డైలాగ్ విజిల్స్ వేయించింది. ముఖానికి ముసుగు కట్టుకుని మరీ విలన్లను ఊచకోత కోసే సీన్లలో పుష్పరాజ్ ఉగ్రరూపం చూపించాడు. మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై ఈ చిత్రం పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో మూవీ విడుద‌ల కానుంది.