Kathikeya: కార్తీకేయ, లోహితల పెళ్ళిలో సందడి చేసిన మెగాస్టార్..

Kathikeya: టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేశారు. ఈరోజున కార్తికేయ తన ప్రియురాలు లోహితతో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల మధ్యన అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.

special guess for karthikeya married4
special guess for karthikeya married4

కార్తికేయ, లోహితల వివాహ బంధం సంతోషంగా ప్రారంభించాలని నిండు మనసుతో ఆశీర్వదించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ పెళ్ళి వేడుకకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.

special guess for karthikeya married3
special guess for karthikeya married3

నూతన వధూవరులకు విషెస్ తెలిపారు. ఈ పెళ్ళి వేడుకకు, అల్లు అరవింద్, సాయికుమార్, తనికెళ్ళభరణిలతో పాటుగా ఆర్ఎక్స్ 100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ లు కూడా కార్తికేయ వివాహానికి హాజరయ్యారు.

special guess for karthikeya married6
special guess for karthikeya married6

ఇక రాజా విక్రమార్క సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లోహితా రెడ్డిని కార్తికేయ తన అభిమానులకు పరిచయం చేసి ప్రపోజ్ చేశారు.

special guess for karthikeya married2
special guess for karthikeya married2

వీరిద్దరికి పదేళ్ళ పరిచయం ఉందని, వారి ప్రేమ బీటెక్ లో ఉన్నప్పుడే మొదలయ్యిందని కార్తికేయ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

special guess for karthikeya married1
special guess for karthikeya married1

లేటెస్ట్ గా రాజా విక్రమార్క అనే సినిమాతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసిన కార్తికేయ, ఈ టైటిల్ ని కూడా చిరంజీవి వీరాభిమానిగానే పెట్టుకున్నట్లుగా స్పష్టతనిచ్చారు.

special guess for karthikeya married5
special guess for karthikeya married5

కోలీవుడ్ లో అజిత్ హీరోగా యాక్ట్ చేస్తున్న వాలిమై సినిమాలో కార్తికేయ విలన్ గా నటిస్తున్నారు.

special guess for karthikeya married
special guess for karthikeya married