SP Balu: ఎస్పీ బాలు జ‌యంతి.. ఆయ‌న జీవితంలోని ఈ నిజాలు మీకు తెలుసా?

SP Balu ఎస్పీ బాలు ఈ పేరు తెలియ‌ని సంగీత ప్రియుడు లేరంటే అతిశ‌యోక్తి కాదు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఆయన సంగీతానికి చేసిన సేవకు గాను ఆరు సార్లు జాతీయ అవార్దు అందుకున్న ఎస్పీ బాలు తన జీవిత కాలంలో 40 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు. జీవిత కాల‌కంలో 40 వేల‌కు పైగా పాటలు అంటే ప్రతీ సంవత్సరం 930 పాటలు పాడారు. ప్రపంచంలో ఈ స్థాయిలో పాటలు రికార్డు చేసిన సింగర్ ఎవరూ లేరు. ఒక్క రోజులోనే అత్యధిక పాటలు పాడిన రికార్డు కూడా బాలూ పేరుపై ఉంది. 12 గంటల్లో 21 పాటలు పాడి రికార్డు క్రియేట్ చేశారు. ఒక్కరోజులోనే 19 తమిళ సాంగ్స్, 16 హిందీ సాంగ్స్ పాడిన రికార్డు కూడా ఆయనకే సొంతం.

S. P. Balasubrahmanyam

బాలు గొంతులో ఓంకార నాదాలు సందానమై నిలుస్తాయి. ఆయన గళం నుంచి జాలువారే.. ప్రతిస్వరం ఆ దివిలో విరిసే పారిజాతమే. ఆయన స్వరంలో సప్తస్వరాలు రాగాలై నర్తిస్తాయి. విషాద పాటలైనా, ప్రేమ గీతాలైనా, మాస్ బీట్స్ అయినా..సందేశాత్మకాలైనా.. ప్రతీది ఆయన నోట అలవోకగా జాలువారుతాయి. విల‌క్ష‌ణ గాయ‌కుడిగా పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన బాలు తెలుగు సినిమా గీతాలకు దొరికిన ఒకానొక ఆణిముత్యం . ఘంటసాల మరణం తర్వాత తెలుగు సినిమా పాటలకు పెద్ద దిక్కైయ్యాడు బాల సుబ్రహ్మణ్యం. ‘శంకరాభరణం’ సినిమాతో ఆయ‌న జీవితం పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు మాస్ గీతాలకే పరిమితం అయిన బాలు.. ఈ సినిమాలో క్లాసికల్ పాటలను సైతం అద్భుతంగా పాడగలనని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు.

బాలు స్పెషాలిటీ ఏంటంటే ఆయా హీరోకు త‌గ్గ‌ట్టు త‌న గొంతును మార్చుకుంటూ ఉంటాడు. తెలుగులోనే కాదు ఉత్తరాదిన కూడా పాడి తన సత్తా చాటుకున్న బాలు హిందీలో తొలిసారి పాడిన ‘ఏక్ దూజేలియే’ చిత్రంలో.. అద్భుతంగా పాడి అక్కడి వారిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఈ సినిమాకు ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు దక్కడం విశేషం. గాయకుడిగానే కాకుండా.. సంగీత దర్శకుడిగా, నటుడిగా, టి.వి వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా.. ఇలా బహుముఖ ప్రఙ్ఞను ప్రదర్శించాడు . చ‌నిపోయే ముందు బాలు నెల్లూరిలోని త‌న సొంత ఇంటిని శంకరాచార్య పీఠానికి ఇచ్చారు. ఉత్తమ గాయకుడిగా ఆరు సార్లు జాతీయ అవార్డు. కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్న బాలు ఎప్ప‌టికి అంద‌రి మ‌న‌సుల‌లో చిర‌స్థాయిగా నిలిచిపోతారు. ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం కుటుం విషయానికి వస్తే..బాలు జీవిత భాగస్వామి పేరు సావిత్రి, కుమారుడు ఎస్పీ చరణ్. చెల్లెలు ఎస్పీ శైలజ.