SURIYA: సూర్య సినిమాకు అరుదైన గౌర‌వం.. ‘ఐఎండీబీ’లో అత్యధిక రేటింగ్ వచ్చిన మూడో సినిమాగా ఆకాశం నీ హ‌ద్దురా

Samsthi 2210 - May 14, 2021 / 07:17 AM IST

SURIYA: సూర్య సినిమాకు అరుదైన గౌర‌వం.. ‘ఐఎండీబీ’లో అత్యధిక రేటింగ్ వచ్చిన మూడో సినిమాగా ఆకాశం నీ హ‌ద్దురా

త‌మిళ న‌టుడు సూర్య న‌టించిన చిత్రాలు ప్ర‌త్యేకంగా ఉంటాయి.ఆయ‌న సినిమాల‌లో వినోదంతో పాటు మెసేజ్ కూడా ఉంటుంది. గ‌త ఏడాది ఎయిర్ డెక్కన్ సంస్థ అధినేత గోపినాథ్ జీవితగాధ ఆధారంగా తెర‌కెక్కిన సూర‌రై పోట్రు చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ పేరుతో విడుదల కాగా, ఈ సినిమాలో అపర్ణ బాలమురళీ హీరోయిన్‌గా నటించింది. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్, సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు. కరోనా కారణంగా చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేశారు. అందులోను ఈ సినిమాకు మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డ‌మే కాక ప‌లువురు సెల‌బ్రిటీల నుండి ప్ర‌శంస‌లు అందుకుంది.

sudha

ఆకాశం నీ హ‌ద్దురా చిత్రం ఇప్ప‌టికే అరుదైన గౌర‌వాలు సాధించింది. 93వ ఆస్కార్‌ అవార్డ్స్‌ నామినేషన్స్‌కు పరిశీలించిన చిత్రాల్లో ‘శూరరై పోట్రు’ ఉన్న విషయం తెలిసిందే. అయితే నామినేషన్‌ దక్కలేదు. మరో ప్రతిష్టాత్మక ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డ్స్‌కు కూడా ఈ చిత్రం వెళ్లింది. తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. చైనాలోని ప్రధాన నగరం షాంఘైలో జరిగిన అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్‌కు ఈ సినిమా ఎంపికైంది. భారత్ నుంచి ఈ ఫెస్టివల్‌కు మూడు సినిమాలు ఎంపిక కాగా.. దక్షిణాది ఇండస్ట్రీల నుంచి ఎంపికైన ఏకైన సినిమాగా సూరరై పోట్రు నిలిచింది. ఈ విషయాన్ని రాజశేఖర్ పాండియన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ప్రైజ్‌ ది బ్రేవ్’ పేరుతో ఈ సినిమా షాంఘై ఫిలిమ్ ఫెస్టివల్‌లో పానరోమా విభాగంలో ప్రదర్శితమవుతుందని ఆయన తెలిపారు.

సూరారై పోట్రు చిత్రం అంతర్జాతీయ సినిమా రివ్యూ సంస్థ ‘ఐఎండీబీ’లో అత్యధిక రేటింగ్ వచ్చిన మూడో సినిమాగా ఈ సినిమా ఘనత సాధించింది. అయితే షాంఘై ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఎంపికైన ఏకైక సౌత్ సినిమాగా సూరరై పోట్రు నిలవడంతో పాటు ఈ సినిమాకు అంత‌ర్జాతీయంగా మూడో స్థానం ద‌క్క‌డంపై సూర్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫిలిమ్ ఫెస్టివల్ జూన్ 11న ప్రారంభమై.. 20వ తేదీన ముగుస్తుంది. సూర్య ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us