SonuSood: చిరు వ్యాపారుల‌కు అండ‌గా సోనూసూద్.. మొక్క‌జొన్న పొత్తులు కాల్చిన రియ‌ల్ హీరో

SonuSood: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచంపై దాడి చేసిన స‌మ‌యంలో సోనూసూద్ త‌న మాన‌వ‌త్వంతో ఎంతో మందికి అండ‌గా నిలిచాడు. నిజానికి దానికంటే ముందే అతను ఫెరోషియస్ విలన్ పాత్రలతో పాటు, వినోదాత్మక పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. అయితే పరిస్థితుల‌ని చూసి చ‌లించిన సోనూసూద్.. ముందు తన సొంత డబ్బుతో సహాయం చేసి ఆ తరువాత ఇతరులను కూడా అందులో భాగం చేశారు.


SonuSood Supporting Corn Seller
SonuSood Supporting Corn Seller

నిరాటంకంగా సోనూసూద్ సేవ‌లు కొన‌సాగుతున్నాయి. లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికుల సాయం చేసిన ఈ రియల్‌ హీరో.. ఇటీవల వీధి వ్యాపారులకు అండగా నిలుస్తున్నాడు. రహదారుల వెంట దుకాణాలు నడుపుకునే చిరు వ్యాపారులకు నేనున్నానంటూ భరోసానిస్తున్నసోనూసూద్ ఆ మ‌ధ్య సైకిల్‌పై గుడ్లు, బ్రెడ్ తదితర తినుబంఢారాలను పెట్టుకొని అమ్మడం చేశాడు. ఆ త‌ర్వాత పంజాబీ ధాబాలో.. ఇక్కడ దాల్.. రోటీ ఉచితమే అంటూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు.

రిక్షా మీద గడ్డి తీసుకుని వెళ్తున్న ఓ వ్యక్తి కనిపించగా, వెంటనే కారు దిగి స్వయంగా తనే రిక్షా తొక్కుకుంటూ వెళ్లాడు సోనూసూద్. ఇలా రోజుకొక చిర వ్యాపారులకు సోనూసూద్‌ అండగా నిలుస్తున్నాడు. ఈసారి జ్యూస్‌ షాప్‌ ఓనర్‌గా మారిపోయాడు. హైదరాబాద్ లో సందడి చేశాడు.. ఇక్కడ బత్తాయి జ్యూస్‌ ఫ్రీ అంటూ స్వయంగా జ్యూస్‌ తయారు చేసి అమ్మాడు. జ‌మ్మూ కాశ్మీర్‌లో షమీమ్‌ఖాన్ అనే వీధి వ్యాపారి దగ్గరికి వెళ్లి చెప్పుల ధరను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా తనకి కొంత డిస్కౌంట్‌ ఇవ్వమని అడిగాడు.

ఇలా చిరు వ్యాపారుల‌కు ఫ్రీ ప్ర‌మోష‌న్ చేస్తున్న సోనూసూద్ తాజాగా మొక్క‌జొన్న పొత్తులు అమ్మే వారి ద‌గ్గ‌ర‌కి వెళ్లాడు. వాళ్ల బిజినెస్ ఎలా జ‌రుగుతుంది. ఎంత‌కు అమ్ముతారు అనే విష‌యాలు తెలుసుకొని వ‌ర్షా కాలంలో వీటికి చాలా గిరాకీ అని చెప్పుకొచ్చారు. తనదైన స్టైల్‌లో చిరు వ్యాపారులకు సోనూ సపోర్టు చేస్తుండటంతో ఆయన చేసిన ఈ పనిపై మరోసారి సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. సోనూ రియల్ హీరో అని మరో సారి రుజువైందంటూ కామెంట్స్ చేస్తున్నారు.