Sonusood: కొడుకు కోసం కాస్ట్‌లీ కారు కొన్న సోనూ.. ధ‌ర ఎంతో తెలుసా?

Sonusood: ఇప్పుడు సోనూసూద్ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. దేశంలో ఇప్పుడు ఎవరికి ఏ కష్టమొచ్చినా, ఆప‌ద‌లో ఉన్నాన‌ని సాయం కోరినా కూడా తనకు తోచినంత తోడ్పాటు అందిస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నారు. తెరపై ప్రతినాయకుడి పాత్రలు పోషించిన సోనూసూద్ కరోనా కష్టకాలంలో స్థాయికి మించి సాయాలు చేసి సూప‌ర్ హీరోగా మారాడు. వలస కార్మికులను సొంతగూటికి చేర్చడంతో పాటు ఆకలితో అలమటించే నిరుపేదల కడుపు నింపడం వరకూ ఆయన చేయని పని లేదు.

Sonusood Buys New Car to his son
Sonusood Buys New Car to his son

సామాజిక మాధ్యమాల్లో ఆయన పేరు మార్మోగిపోతోంది. ఏ ఫ‌లితం ఆశించ‌కుండా సోనూసూద్ సాయాలు చేస్తుండ‌గా, ఆయ‌న‌కు ఇంత డ‌బ్బులు ఎక్క‌డివి, రాజ‌కీయ నాయ‌కులు కూడా చేయ‌ల‌ని సాయాన్ని సోనూసూద్ ఎలా చేయ‌గ‌లుగుతున్నారు అని ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేశారు. దానిపై సోనూసూద్ ప‌లుమార్లు క్లారిటీ కూడా ఇచ్చాడు.

సోనూసూద్ చేస్తున్న మంచి ప‌నుల‌కు ఆయ‌న‌తో ప‌లు కంపెనీలు జ‌త‌క‌ట్టి ఆయ‌న చేస్తున్న సేవ కార్య‌క్ర‌మంలో భాగం అవుతున్నాయి. అయితే ఒక‌ప్పుడు ఏమి లేని స్థాయిలో ఉన్న సోనూసూద్ ఇప్పుడు బాగానే ఆర్జించాడు. న‌టుడిగానే కాదు బిజినెస్ లు కూడా చేస్తున్నాడు. అయితే ఈ రియ‌ల్ హీరో బ‌య‌టి జ‌నాన్ని సంతోష‌ప‌ర‌చ‌డ‌మే కాకుండా కుమారుడు కోరిన కోరిక‌ను కూడా తీర్చి సూప‌ర్ డాడ్ అనిపించుకుంటున్నాడు.

జూన్ 20న ఫాదర్స్ డే కాగా, ఈ సందర్భంగా తన కొడుకు ఇషాంత్ సూద్ కు లగ్జరీ కారు కొనిచ్చాడు. రెండున్న‌ర కోట్ల రూపాయ‌ల‌తో మెర్సిడెజ్ బెంజ్- మేబాచ్ జీఎల్ఎస్ 600 మోడల్ కారును కొని గిఫ్టుగా ఇచ్చాడు. తన కుమారుడి కోసం తీసుకున్న కారుకు సంబంధించిన వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది.తన ఇంటికి వచ్చిన కారుతో కుటుంబ సభ్యులంతా కలిసి ట్రయల్ వేశారు.

సోనూసూద్ కూడా ల‌గ్జ‌రీ కార్లుని చాలా ఇష్ట‌ప‌డ‌తారు. కొత్త కారుతో సోనూసూద్ ర‌య్యిన తిరుగుతున్నారు. అయితే ఇప్ప‌టికే ఆయ‌న గ్యారేజ్ లో ఆడీ క్యూ7, మెర్సిడెజ్ బెంజ్ ఎంఎల్ క్లాస్, పోర్చే పానామెరా సహా పలు కార్లు ఉన్నాయి.తాజాగా కొన్న మెర్సిడెజ్ బెంజ్- మేబాచ్ జీఎల్ఎస్ 600 కారు గ‌త వార‌మే మార్కెట్‌లోకి వ‌చ్చింది.

ఈ కారు ప్ర‌త్యేక‌త ఏంటంటే కారు స్టార్ట్ అయిన 5 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కారు వెనుక భాగంలో విశాలమైన ప్రదేశం ఉంటుంది. ముందుభాగంలో కూడా ఫ్రీగా కూర్చోవచ్చు. ఈ కారుని చూసి చాలా మంది అవాక్క‌వుతున్నారు. కాగా, సోనూసూద్ సినిమ‌ల విష‌యానికి వ‌స్తే సోను సూద్ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నాడు.చిరంజీవితో ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. హిందీలో పృథ్వీరాజ్, తమిళంలో తమిళ్ రాసన్ సినిమాలు చేస్తున్నాడు.