SONU SOOD: గుడ్ న్యూస్.. రియ‌ల్ హీరోకు కరోనా నెగెటివ్..!

ప్ర‌స్తుతం కరోనా విల‌య‌తాండ‌వం చేస్తుండ‌డంతో చాలా మంది సినీ సెల‌బ్రిటీలు క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్న విష‌యం తెలిసిందే. చిన్న స్టార్స్ నుండి టాప్ స్టార్స్ వ‌ర‌కు క‌రోనాతో క్వారంటైన్‌లో ఉంటున్నారు. మ‌హేష్ బాబు, ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో సాన్నిహిత్యంగా ఉండే వారికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో వీరు క్వారంటైన్‌కు వెళ్లారు. ఇక వెండితెర‌పై విల‌న్‌గా క‌నిపించి అల‌రించిన నిజ జీవితంలో ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌తో రియ‌ల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్‌కు కొద్ది రోజుల క్రితం క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన విష‌యం తెలిసిందే.

సోనూసూద్‌కు క‌రోనా పాజిటివ్ అని తెలిసి చాలా మంది త్వ‌ర‌గా కోలుకోవాల‌ని పూజ‌లు చేశారు. కొంద‌రు ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకున్నారు. అయితే తాజాగా ఆయ‌నకు జ‌రిపిన ప‌రీక్ష‌ల‌లో క‌రోనా నెగెటివ్ అని తేలింది. ఈ విష‌యాన్ని సోనూసూద్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ఇంత మంచి గుడ్ న్యూస్ ఫ్యాన్స్ చెవిన ప‌డ‌డంతో సంబ‌రాలు జ‌రుపుకుంటున్నారు. ఇదిలా ఉంటే గ‌త ఏడాది క‌రోనా స‌మ‌యంలో ఎంతో మందికి త‌న సేవ‌ల‌ను అందించిన సోనూ ఇప్ప‌టికి దానిని కొన‌సాగిస్తుండ‌డం హ‌ర్ష‌ణీయం.

Advertisement