Sonu Sood: 135 కోట్ల భార‌తీయుల ప్రేమే నాకు పెద్ద అవార్డ్: సోనూసూద్

Sonu Sood: సోనూసూద్.. కరోనా కష్టకాలంలో సూపర్ హీరోగా మారిన ఆన్‌స్ట్రీన్ విలన్. ఒక‌ప్పుడు సోనూసూద్ విల‌నిజాన్నిచూసి ఎంతో భ‌య‌ప‌డేవారు. కాని ఇప్పుడు ఆయ‌న‌లో దాగి ఉన్న‌మాన‌వ‌త్వాన్నిచూసి గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారు. కొంద‌రైతే గుడులు క‌ట్టిపూజిస్తుండ‌గా,మ‌రి కొంద‌రైతే వారి షాపుల‌కు లేదంటే పుట్టిన పిల్ల‌ల‌కు సోనూసూద్ పేరు పెట్టుకుంటున్నారు.ఎలాంటి ఫ‌లితం ఆశించ‌కుండా సోనూసూద్ చేస్తున్న సేవ‌లు ఎంద‌రికో ఆద‌ర్శ‌వంతంగా నిలుస్తున్నాయి.

Sonu Sood

సోనూసూద్‌పై ప్ర‌జ‌ల‌లో ఎంత అభిమానం పెరిగింది అంటే ఆయ‌న‌ను వెండితెర‌పై కూడా విల‌న్‌గా చూసేలే క‌నిపించ‌డం లేదు. ఈ పరిస్థితిల్లో సోనూ విలన్‌గా నటిస్తే… అది సినిమాకు ప్లస్ అవుతుందా… మైనస్ అవుతుందా..? అనేది మేక‌ర్స్‌కు కొత్త ఆలోచ‌న‌ల‌ను రేకెత్తిస్తుంది. సోనూతో ఓ సీన్ చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి కూడా భయపడ్డారట. ఫైట్ సీక్వెన్స్ విషయంలో చిరు కొన్ని మార్పులు సూచించార‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి.

సోనూసూద్‌పై న‌మ్మ‌కంతో పాటు ప్రేమ పెరుగుతూపోతుంది.సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం ఆయ‌న‌ని ప్ర‌శంసిస్తూ ఉన్నారు.తాజాగా సీనియ‌ర్ న‌టుడు బ్రహ్మాజీ ..సోనూసూద్‌కు ప‌ద్మ‌విభూష‌ణ్ ఇవ్వాలని కోరాడు. నిజంగానే ఆ అవార్డ్‌కి ఆయ‌న అర్హుడ‌ని భావిస్తే… ప‌ద్మ‌విభూష‌ణ్ ఫ‌ర్ సోనూసూద్ అనే హ్యాష్ ట్యాగ్‌ను రీ ట్వీట్ చేయాల‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా కోరాడు.

Sonu Sood

బ్ర‌హ్మాజీ ట్వీట్‌పై వెంట‌నే స్పందించిన సోనూసూద్ .. సోద‌రా! 135 కోట్ల మంది భార‌తీయుల ప్రేమాభిమానాలే నాకు పెద్ద అవార్డు, దాన్ని నేను ఇప్ప‌టికే సంపాదించుకున్నాను’ అని రిప్లై ఇచ్చారు. అయితే అభిమానులు మాత్రం సోనూసూద్‌కి పద్మ విభూష‌ణ్ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

కరోనా కష్టకాలంలో బాధితులకు ఆపద్బాంధవుడయ్యారు సోనూ సూద్. కొవిడ్ బాధితులకు పలు రకాలుగా సాయం అందిస్తున్నారు. ఆక్సిజన్, బెడ్స్, ఇంజెక్షన్స్.. ఇలా ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా ఆదుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఆయ‌న సేవ‌లు నిరాటంకంగా కొన‌సాగుతున్నాయి.

Sonu Sood

రియల్ హీరో సోనూసూద్‌పై ఉన్న అభిమానంతో ఆయ‌న‌ను కలిసేందుకు వికారాబాద్ నుంచి ముంబైకి పాదయాత్ర చేపట్టాడు వెంక‌టేష్ అనే వ్య‌క్తి. పది రోజుల్లో దాదాపు 700 కి.మీ. నడిచి ఎట్టకేలకు అభిమాన నటుడిని కలుసుకున్నాడు. తన కోసం కాలినడకన వచ్చిన అభిమానిని చూసి సోనూసూద్ చలించిపోయాడు. అతడిని తన ఇంటికి పిలిచి.. కాసేపు అతడితో ముచ్చటించాడు. వెంకటేష్ తనకు ఎంతో స్పూర్థిదాయకంగా నిలిచాడని తెలిపాడు సోనూసూద్. కానీ దయచేసి ఎవరూ ఇలాంటి సాహసాలు చేయొద్దని కోరాడు.