Sonu Sood: చిరంజీవి, చ‌ర‌ణ్‌ల‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించిన రియ‌ల్ హీరో

Sonu Sood: కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే ఎంతోమంది ప్రజలు తమ ప్రాణాల్ని కోల్పోయారు. అలాంటి వారికి ఎంతోమంది సెలెబ్రిటీలు వెన్నుదన్నుగా నిలిచారు. అందులోనూ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఇంకో స్టెప్ వేసి తనకు సాధ్యమయినంత మేరకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సొంత ఆస్తులను సైతం ప్రజలకోసం ఉపయోగిస్తున్నారంటే ఆయన హృదయం ఎంత ఉన్నతమైనదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ప్రస్తుతం సోనూసూద్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. జాతీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఆయన గుర్తింపు పొందారు.

పేదలకు వరాలిచ్చే మహనీయుడిగా రికార్డ్ సాధించారు. అవసరం అంటూ వచ్చిన ప్రతిఒక్కరి హృదయాలకు సాయం అందించారు. కోవిడ్ కారణంగా ప్రాణాలు వదిలేస్తున్న సమయం తనే ఊపిరిగా మారి ఆదుకున్నారు. ఈ నేపథ్యంలో సోనూసూద్.. మెగా స్టార్, ఆయన తనయుడిని ప్రశంసలతో ముంచెత్తారు. కరోనా లాంటి మహమ్మారి సమయంలో ఎవ్వరూ చేయని సాహసాన్ని, సేవల్ని మెచ్చుకున్నారు. ఎంతోమందికి ఆక్సిజన్ ను సరఫరా చేస్తూ.. అవసరానికి ట్రీట్ మెంట్ చేయించిన ఘనతను చాటారు. దేశంలో ఎంతోమంది అభాగ్యులు ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు ఆవిరి అవుతున్న సమయంలో సోనూసూద్ క్షణాల్లో వాటిని అందించారు.

ఈ నేపథ్యంలో సోనూ దిశగా చిరంజీవి తాను సైతం అంటూ ప్రజలకు ఆక్సిజన్ కొరతను తీర్చారు. మెగా స్టార్ బ్లడ్ బ్యాంక్ మాదిరిగా ఆక్సిజన్ బ్యాంకును తెలుగు రాష్ట్రాల్లో స్థాపించి తన ఉనికిని చాటుకున్నారు. మెగాస్టార్ ప్రారంభించిన ఈ ఈవెంట్ పై చిరు, చెర్రీలపై సోనూసూద్ స్పందించారు. వారి నిర్ణయం చాలా గొప్పదని, ఆక్సిజన్ బ్యాంకులు మొదలుపెట్టడమనేది ఎంతో ఉన్నతమైన నిర్ణయమని, ఈ క్రమంలో మరింత మంది సెలెబ్రిటీలు ప్రజల కోసం ముందుకు రావాలని కోరారు. వారికి సాధ్యమైనంతవరకు సాయం చేయాలని కోరారు. అప్పుడే ప్రజల్లో మనం నిజమైన హీరోలుగా ఉంటామని అన్నారు. ఎవ్వరో, ఎప్పుడో, ఏదో చేస్తారని ఎదురుచూడటం అవివేకం అని మనమే ముందడుగు వేయాలని సోనూ పిలుపునిచ్చారు. అలాగే సోనూసూద్ ను ఆచార్య సినిమాలో చేసిన విలన్ క్యారెక్టర్ తో ప్రజలు చూడలేరని, అందుకే తనను ఒక యాక్టర్ గానే చూడాలని హీరో చిరంజీవి అన్నారు. ఈ క్రమంలోనే ఓ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా డైరెక్టర్ మార్చినట్లు తెలుస్తుంది.