SONU SOOD: డీటీడీసీ కొరియ‌ర్ ద్వారా ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేయ‌నున్న సోనూసూద్..!

క‌రోనా మ‌హమ్మారి ప్ర‌ళ‌యం సృష్టిస్తున్న‌ప్ప‌టి నుండి సోనూసూద్ సేవ‌లు అప్ర‌తిహ‌తంగా ముందుకు సాగుతున్నాయి. వ‌ల‌స కూలీల‌ను స్వ‌స్ధ‌లాల‌కు త‌ర‌లించ‌డ‌మే కాకుండా ఆక‌లితో ఉన్న వారి ఆక‌లి తీర్చి, ఉద్యోగం లేని వారికి జాబ్ క‌ల్పించి, ఆసుప‌త్రి ఖ‌ర్చు భ‌రించ‌లేని వారికి సాయం అందించి ఎంద‌రో మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు సోన‌సూద్. కొంత మంది కోసం ఏకంగా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి ప్రభుత్వాలు సైతం చేయలేని సాయాన్ని చేసి నిజమైన హీరో అనిపించుకున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ అతడే రియల్ హీరో.

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో.. చాలా మంది ఆస్పత్రులలో బెడ్స్ దొరక్క, ఆక్సిజన్ కోరత కారణంగా మరణిస్తున్న నేప‌థ్యంలో ఆక్సిజ‌న్ కొర‌త రాకుండా చూస్తున్నాడు సోనూసూద్. ప్ర‌త్యేక ఆక్సిజ‌న్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తూ, అవ‌స‌ర‌మైన వారికి ఆక్సిజన్ అందించి ఎంద‌రో ప్రాణాలు నిలిచేలా చేశాడు సోనూసూద్. తాజాగా ఆయ‌న సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆక్సిజన్‌ అవసరం ఉన్న రోగులకు భారతదేశ వ్యాప్తంగా సిలిండర్లు సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆక్సిజన్‌ అవసరం ఉన్న రోగులు దేశంలోని ఎక్కడి నుంచి అడిగినా సిలిండర్‌ పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరం ఉన్న వారు www.umeedysonusood.com కు లాగిన్‌ అయితే వారికి డీటీడీసీ ద్వారా కొరియర్లు అందనున్న‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు.