SONU SOOD: డాక్ట‌ర్, ఇంజ‌నీర్ కాదు.. సోనూసూద్ అవుతానంటూ చిన్నారి కామెంట్స్

క‌రోనా క‌ష్ట‌కాలంలో అడిగిన వారికి లేద‌న‌కుండా సాయం చేస్తూ అంద‌రివాడు అనిపించుకుంటున్నారు సోనూసూద్. గ‌త ఏడాది నుండి మొద‌లైన సోనూసూద్ సేవా కార్య‌క్ర‌మాలు ఇప్ప‌టికీ కొన‌సాగుతున్నాయి. ఆక్సిజ‌న్ వ‌ల‌న చాలా మంది మృత్యువాత ప‌డుతున్నార‌ని తెలుసుకున్న సోనూసూద్ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయించడానికి ముందుకు వ‌చ్చారు. రాజకీయ నాయకులందరూ ఒకరిపై ఒకరు బురద చల్లుకునే ప్రయత్నాలు మాని ఐక్యంగా కలిసి ప్రజలకు సాయం అందించాలి అని సోనూ అంటున్నారు.

రీల్ విల‌న్ నుండి రియ‌ల్ హీరోగా మారిన సోనూసూద్ అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటున్నారు. చిన్న పిల్ల‌లు సైతం సోనూసూద్ సేవా కార్య‌క్ర‌మాల‌ను చూసి ఆయ‌న‌ను స్పూర్తిగా తీసుకుంటున్నారు. తాజాగా ఓ చిన్నారి ఇంజ‌నీర్, డాక్ట‌ర్, లాయ‌ర్ కాకుండా సోనూసూద్‌ల న‌లుగురికి మంచి సేవ‌లు చేస్తాన‌నంటుంది. చిన్నారికి సంబంధించి వీడియోని ఆమె త‌ల్లి ప్ర‌శాంతి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేయ‌గా, ఆమె మాట‌ల‌కు ఫిదా అయిన సోనూ సూద్ ఆమె స్టార్ అంటూ బ‌దులిచ్చాడు.చిన్నారి వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.